ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు: సాయం కోసం ఫ్రెండ్‌కు మెసేజ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ అనిస్సియా భాత్రా (39) ఆత్మహత్యలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు వారి మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలియనున్నాయి. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

సమాచారం మేరకు ఆమె తన చనిపోయిన రోజు తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరికి కూడా ఓ టెక్స్ట్ మెసేజ్ పంపించిందని తెలుస్తోంది. పోలీసులు ఆమె ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు భర్త మయాంక్ సింగ్వీ కారణమని ఎయిర్ హోస్టెస్ తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

 బెస్ట్ ఫ్రెండ్‌కు సందేశం

బెస్ట్ ఫ్రెండ్‌కు సందేశం

ఆమె తన బెస్ట్ ఫ్రెండ్‌కు పంపిన సందేశంలో.. తన భర్త తనను గదిలో వేసి బంధించాడని, కాబట్టి తనకు సహాయం చేయాలని, ఇక్కడకు రావాలని కూడా ఆ ఫ్రెండ్‌ను కోరినట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, పోలీసులు దీనిని నిర్ధారించాల్సి ఉంది. దీంతో పోలీసులు అతనిని కూడా విచారించడానికి సిద్ధమయ్యారు.

ఆమెను ప్రశ్నిస్తే విషయం తెలుస్తుంది

ఆమెను ప్రశ్నిస్తే విషయం తెలుస్తుంది

తనను భర్త గదిలో బంధించాడని, దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనిస్సీయా తన ఫ్రెండ్‌కు చెప్పినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అయితే ఇది నిజమా లేదా మరింత సమాచారం కోసం ఆమెను కూడా ప్రశ్నిస్తామని, ఆ తర్వాతే విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

ఇదిలా ఉండగా, అనిస్సీయా ఆత్మహత్యకు భర్త మయాంక్, అతని తల్లిదండ్రుల వేధింపులే కారణమని, పెళ్లయినప్పటి నుంచి ఆయన శారీరకంగా వేధించేవాడని ఆమె తల్లి ఆరోపించారు. కట్నం కోసం కూడా వేధించారని చెప్పారు. తాజాగా, మరో విషయం వెలుగు చూసింది. అనిస్సియా, మయాంక్‌‌లు 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొత్త కోణం.. మొదటి భార్య నుంచి విడాకుల వల్లే

కొత్త కోణం.. మొదటి భార్య నుంచి విడాకుల వల్లే

అనిస్సియా ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తుండగా, మయాంక్ గుర్‌గావ్‌లో సాఫ్టువేర్ ఉద్యోగి. అతను సంవత్సరానికి రూ.4 కోట్లు సంపాదించేవాడు. అనిస్సియాతో పెళ్లికి ముందే మయాంక్‌‌కు పెళ్లైంది. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ విషయం చెప్పకుండా మయాంక్‌.. అనిస్సియాను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకుల విషయం తెలిసి మయాంక్‌పై అనిస్సియా కోపంగా ఉంది. ఈ విషయంపైనే వారిద్దరికీ గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనిస్సియా భత్రాకు సింగ్వీ ఖరీదైన వస్తువులు కొనిచ్చేవాడు. పుట్టిన రోజుకు బీఎంబ్ల్యూ కారు ఆమెకు బహూకరించాడు. పోలీసులు కారును సీజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+