ఎయిరిండియా ఫ్లైట్ కాక్ పిట్ వీడియోలో అది మిస్సింగ్.. ? అక్కడే డౌట్స్..!
గత నెలలో అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏఐ171 టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిన ఘటనపై దర్యాప్తులతో చిక్కుముడి వీడకపోగా.. మరింత క్లిష్టంగా మారుతోంది. గత శనివారం భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన నివేదిక తర్వాత అసలేం జరిగిందో తేలుతుందని అంతా భావించగా.. ఇప్పుడు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కాక్ పిట్ రికార్డింగ్ వివరాలు దీన్ని మరింత సంక్లిష్టంగా మార్చేశాయి. అయితే ఏఏఐబీ ఈ రిపోర్టును తోసిపుచ్చింది.
గతవారం భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఇచ్చిన ప్రాధమిక నివేదికలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి కొన్ని సెకన్ల ముందు పైలట్లలో ఒకరు మరొకరితో ఆయిల్ స్విచ్ ఎందుకు ఆపేశారని అడిగితే ఇంకొకరు తాను ఆపలేదని చెప్పినట్లు తేల్చింది. తిరిగి ఆయిల్ స్విచ్ ఆన్ చేసే లోపే విమానం కుప్పకూలిందని తెలిపింది. దీంతో పైలట్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వాదన మొదలైంది. దీన్ని భారత పైలట్ల సంఘంతో పాటు అంతర్జాతీయ పైలట్ల సంఘం కూడా తప్పుబట్టాయి.

ఇది జరిగిన నాలుగు రోజులకే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో తమ దేశానికి పంపిన కాక్ పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ లపై చేసిన అధ్యయనంలో మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఇచ్చిన రిపోర్టులో చెప్పినట్లుగా ఓ పైలట్ అని కాకుండా కెప్టెన్ ఈ స్విచ్ ను ఆఫ్ చేశారని గుర్తించి ఎందుకు ఆఫ్ చేశారని అప్పుడు విమానం నడుపుతున్న సెకండ్ పైలట్ (ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ ను అడిగినట్లు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తేల్చింది. అయితే ఏఏఐబీ ఇచ్చిన రిపోర్టులో మాత్రం తాను స్విచ్ ఆఫ్ చేయలేదని ఓ పైలట్ చెప్పినట్లు మాత్రమే వెల్లడించారు. దీంతో ఏఏఐబీ రిపోర్టుపై అనుమానాలు మొదలయ్యాయి.
అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో మరో అంశం కూడా ఉంది. అది కాక్ పిట్ వీడియో రికార్డింగ్. ఇందులో ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్న రెండో పైలట్ క్లైవ్ కుందర్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ ను ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆపారని అడగడం, దానికి ఆయన మౌనంగా ఉండిపోవడం మాత్రమే ఉందని, అయితే అసలు ఆయిల్ స్విచ్ కెప్టెనే ఆపారని కచ్చితంగా చెప్పేందుకు తగిన ఫుటేజ్ లేదని కూడా తెలిపింది. తద్వారా అసలు ఆ స్విచ్ ను కెప్టెన్ ఆపాడా లేదా అన్నది కూడా తేలలేదు.

అయితే వీరి పైలట్ల సంభాషణ ప్రకారం చూస్తే మాత్రం కెప్టెన్ స్విచ్ ఆపినట్లు ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. లేకపోతే పైలట్ క్లైవ్ కుందర్ అడిగినప్పుడు దానికి కెప్టెన్ సమాధానం చెప్పి ఉండే వారు కదా అనేది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రశ్న. అయితే ఏఏఐబీ రిపోర్టులో మాత్రం రెండో పైలట్ తాను స్విచ్ ఆపలేదని సమాధానం ఇచ్చినట్లు పేర్కొనడం ఇక్కడ బిగ్ ట్విస్ట్..
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications