ఎయిర్‌హోస్టెస్‌పై పైలెట్ లైంగిక వేధింపులు, విచారణ

ముంబై: ఎయిరిండియాలో పనిచేసే ఎయిర్‌హోస్టెస్‌పై పైలెట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎయిరిండియాలో లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూడడం కలకలం రేగుతోంది. గతంలో ప్రయాణీకులు ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు చోటుచేసుకొన్నాయి. అయితే తాజాగా చోటు చేుకొన్న ఘటన మాత్రం ఎయిరిండియా పైలెట్ ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Air India Pilot Accused Of Molesting Air Hostess After Mid-Air Fight

మే 4వ తేదిన అహ్మదాబాద్ - ముంబై ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ మేరకు బాధితురాలు ఎయిరిండియా సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పైలెట్‌పై ఆమె పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

విమానం ముంబై చేరుకోగానే సహర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు పైలట్‌పై ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌హోస్టెస్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

ఘటనపై పోలీసులతో పాటు ఎయిర్‌ ఇండియా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు.ఈ అంశంపై విచారణ సాగుతోందని ఎయిరిండియా అధికారులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+