ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ముప్పు!

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది! సిబ్బంది సహా సుమారు 200 మంది ప్రయాణీకులతో ఢిల్లీ నుండి టోక్యో బయలుదేరిన ఎయిరిండియా విమానం తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడింది. ఈ సంఘటన జనవరి 19వ తేదీన జరిగింది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి పందొమ్మిదిన రాత్రి స్థానిక ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టోక్యోకు బయలుదేరిన కొద్ది సేపటికే బోయింగ్ 787 విమానంలోని ఒక ఇంజిన్ నుండి మంటలు వచ్చాయి. దీనిని సిబ్బంది, కొందరు ప్రయాణీకులు గుర్తించారు.

Air India's UK flight leaves with bag sans flyer, returns

టేకాఫ్ తీసుకొని వెంటనే విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. దీంతో ప్రయాణీకులు పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ప్రయాణీకులను మరో ఎయిరిండియా విమానంలో టోక్యోకు పంపించారు.

225 మంది ప్రయాణీకులతో కూడిన లండన్ - ముంబై ఎయిర్ ఇండియా విమానం టెక్నికల్ కారణాలతో హంగేరియన్ రాజధానికి మళ్లించారు. ఇది గురువారం నాడు రాత్రి జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+