Airtel Down: ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం!

Airtel Down: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత మూడు గంటలుగా చాలా మంది యూజర్లు కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై వినియోగదారులు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. మొదట నెట్‌వర్క్ అంతరాయంపై ఎయిర్‌టెల్ ఒక పోస్ట్ చేసినా, తరువాత దాన్ని తొలగించిందని యూజర్లు ఆరోపిస్తున్నారు. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ యూజర్లు కాల్స్, మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి కాల్స్ వెళ్తున్నా, ఎక్కువ మందికి 'కాల్ ఫెయిల్డ్' అనే మెసేజ్ వస్తోంది. అయితే మొబైల్ ఇంటర్నెట్ మాత్రం పనిచేస్తోంది. ఆశ్చర్యకరంగా, కొంతమందికి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ నుంచి ఎలాంటి రిక్వెస్ట్ లేకుండానే ఓటీపీలు వస్తున్నాయి.

ఎయిర్‌టెల్‌తో పాటు పెర్‌ప్లెక్సిటీ (Perplexity)కి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా పనిచేయడం లేదు. ఇది ఎయిర్‌టెల్ నంబర్ ద్వారా పెర్‌ప్లెక్సిటీ ప్లాన్ తీసుకున్న వారికి జరుగుతోంది. ఎందుకంటే.. ఎయిర్‌టెల్ పెర్‌ప్లెక్సిటీతో ఒక ఒప్పందం చేసుకుని, తమ యూజర్లకు ఒక సంవత్సరం పాటు ఉచిత సేవలు అందిస్తోంది.

Airtel Network Down Across India Call Failures OTP Glitches Raise Alarms

కంపెనీ పోస్టును తొలగించిందా?
గత కొన్ని గంటలుగా 'ఎయిర్‌టెల్‌ డౌన్' అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్(ట్విట్టర్)లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై ఎయిర్‌టెల్‌ తన అధికారిక హ్యాండిల్ నుంచి నెట్‌వర్క్‌కు అంతరాయం కలిగిందని, దానిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంటూ క్షమాపణలు కోరింది. అయితే, యూజర్లు మాత్రం ఎయిర్‌టెల్ ఈ పోస్ట్‌ను తరువాత తొలగించిందని ఆరోపిస్తున్నారు.

డౌన్‌డెటెక్టర్ నివేదిక ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ అంతరాయం మొదలైంది. ఇది కేవలం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉంది. నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడినప్పుడు సాధారణంగా నెట్‌వర్క్ సిగ్నల్స్ రాకపోవడం లేదా మొబైల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడం జరుగుతుంది. కానీ ఈసారి, కొన్ని చోట్ల ఫుల్ నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, కాల్స్ రావడం, వెళ్లడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

పెర్‌ప్లెక్సిటీ వల్ల సమస్యలు వచ్చాయా?
ఎయిర్‌టెల్‌తో పాటు పెర్‌ప్లెక్సిటీ గురించి కూడా యూజర్లు ఎక్స్ వేదికగా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు యూజర్లకు ఓటీపీలు వస్తుండటంతో, ఎయిర్‌టెల్-పెర్‌ప్లెక్సిటీ భాగస్వామ్యమే ఈ సమస్యలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+