షాకింగ్: మారన్ నుంచి రూ.2కే స్పైస్‌జెట్ కొనుగోలు చేసిన అజయ్ సింగ్
స్పైస్‌జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కల్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, అప్పటి ప్రమోటర్ కళానిధి మారన్ నుంచి అజయ్ సింగ్ 2015లో కేవలం 2రూపాయలకే స్పైస్‌జెట్‌లో 58.46 శా
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కల్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, అప్పటి ప్రమోటర్ కళానిధి మారన్ నుంచి అజయ్ సింగ్ 2015లో కేవలం 2రూపాయలకే స్పైస్‌జెట్‌లో 58.46 శాతం వాటా దక్కించుకొన్నారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలను ప్రచురితం చేసింది.
భారతదేశంలో సంస్థల విలీన, విక్రయాల చరిత్రలో ఒక నమోదిత సంస్థను ఐదు రూపాయల లోపే విక్రయించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 15 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తైపోవడం మరో విశేషం.

కాగా, కన్వర్టిబుల్ సెక్యూరిటీలపై అజయ్, మారన్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సంబంధిత కేసుపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ విషయం బయటికి తెలిసింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం కొనుగోలు జరిగే సమయంలో స్పైస్జెట్, అజయ్ సింగ్, మారన్ ఎవ్వరూ ఈ లావాదేవీ గురించి బయటికి వెల్లడించలేదు.
షేరు ధర 100 శాతం డిస్కౌంట్తో అమ్ముడుపోయిన నమోదిత సంస్థ గురించి సెబీ సైతం బహిర్గతం చేయాలని ఆదేశించకపోవడం గమనార్హం. విక్రయానికి ముందు 22 లక్షల డాలర్ల(సుమారు రూ.1418కోట్లు) ఇంధన బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డ స్పైస్ జెట్ ప్రస్తుతం ఉత్తమ విమానయాన సంస్థల్లో ఒకటిగా ఉండటం విశేషం.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications