రాజకీయాల్లో ఆయనో 'అమితాబ్ బచ్చన్'.. అజిత్ పవార్‌కు ఆ ట్యాగ్ ఎందుకు?

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఓ తిరుగులేని శక్తి. మహా రాజకీయాల్లో ఆయన ముద్ర ఎంతటిదో వివరించడానికి ఆయన సోదరి సుప్రియా సులే గతంలో వాడిన 'పాలిటిక్స్ అమితాబ్ బచ్చన్ ' అనే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన నేపథ్యంలో సుప్రియా సులే చేసిన ఆ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆ ట్యాగ్ వెనుక ఉన్న వివాదం ఏంటి?
2023లో మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా సాగిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ అప్పట్లో అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఉండేవారు. ఆ సమయంలో శివసేన (షిండే వర్గం) మంత్రి దీపక్ కేసర్కర్ ఒక బహిరంగ ప్రకటన చేస్తూ.. అజిత్ పవార్ వంటి అనుభవజ్ఞుడైన నేత తమ పార్టీలోకి వస్తే ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుందని, ఆయన మాటను ప్రజలు ఎంతో సీరియస్‌గా తీసుకుంటారని ఆఫర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన సుప్రియా సులే.. తన సోదరుడి పవర్‌ను వివరిస్తూ అమితాబ్ బచ్చన్‌తో పోల్చారు.

ajit pawar amitabh bachchan of politics Why Supriya Sule Called as bachchan A Look Back Details

సుప్రియా సులే ఏమన్నారంటే?
"అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలకు అమితాబ్ బచ్చన్ వంటి వారు. ప్రతి సినిమా మేకర్ తన సినిమాలో అమితాబ్ ఉండాలని, ఆయన గొంతు వినిపించాలని లేదా కనీసం ఆయన ఫోటో అయినా ఉండాలని ఎలా కోరుకుంటారో.. అలాగే ప్రతి రాజకీయ పార్టీ అజిత్ పవార్ తమతో ఉండాలని కోరుకుంటుంది. ఆయన పేరు, ఆయన చేసే పని ఆ స్థాయిలో గుర్తింపు పొందాయి." అని సుప్రియా సులే అప్పట్లో పేర్కొన్నారు.

అమితాబ్ బచ్చన్ కు, అజిత్ పవార్‌కు ఉన్న ఆ పోలికలేంటి?
సినిమాల్లో అమితాబ్ బచ్చన్‌కు ఎంతటి క్రేజ్ ఉందో, మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్‌కు అంతటి మాస్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు 'అజిత్ దాదా'గా విపరీతమైన ఆదరణ ఉంది. అమితాబ్ లేని సినిమా హిట్టవ్వడం కష్టమన్నట్టుగా, అజిత్ పవార్ మద్దతు లేకుండా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమనే పరిస్థితి ఉండేది. అందుకే బీజేపీ, శివసేన వంటి ప్రత్యర్థి పార్టీలు కూడా ఆయన కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచేవి. అమితాబ్ బచ్చన్ గొంతు ఎంత గంభీరంగా ఉంటుందో, అసెంబ్లీలో అజిత్ పవార్ ప్రసంగాలు కూడా అంతే సూటిగా, స్పష్టంగా ఉండేవి.

తుదిశ్వాస విడిచేవరకు ఎన్సీపీలోనే..
ఆ సమయంలో ఆయన పార్టీ మారుతున్నారని పుకార్లు వచ్చినప్పుడు, అజిత్ పవార్ ఒక కీలక ప్రకటన చేశారు. "నేను చనిపోయే వరకు ఎన్సీపీలోనే ఉంటాను" అని స్పష్టం చేశారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారి ఆయన ఎన్సీపీని రెండుగా చీల్చి బీజేపీతో జతకట్టినప్పటికీ.. ఆయన రాజకీయ సత్తా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అమితాబ్ బచ్చన్ సినీ రంగానికి ఎలాగో, అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలకు అలాగే ఓ ఐకాన్‌గా మిగిలిపోయారు. అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాల్లో భర్తీ చేయలేని ఓ పెద్ద శూన్యాన్ని మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+