Ajit Pawar Plane: కూలిన విమానంలో నాలుగైదు పేలుళ్లు..! ప్రత్యక్ష సాక్షి షాకింగ్..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ (ajit pawar) ఇవాళ బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పక్కనే ఉన్న గ్రామస్థులు అంతా కళ్లకు కట్టినట్లు చూశారు. ఈ సందర్భంగా వారు తమ భయానక అనుభవాల్ని మీడియాతో పంచుకున్నారు. అసలు విమానం ఎలా ల్యాండ్ అవుతూ వచ్చింది, చివరికి ఎలా ముక్కలైందనే అంశాల్ని వారు వెల్లడించారు.
ప్రత్యక్ష సాక్షి కథనం
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానాన్ని తాను దగ్గరి నుంచి చూశానని స్థానిక గ్రామస్థుడు ఒకరు వెల్లడించారు. విమానం కిందకు దిగుతున్న క్రమంలో అతి కచ్చితంగా కూలిపోతుందనే అంచనాకు తాను వచ్చేసినట్లు తెలిపారు. చివరికి అదే నిజమైందన్నారు. రన్ వేపైకి దిగగానే ఆ విమానం పేలిపోయిందన్నారు. ఆ తర్వాత ముక్కలైందన్నారు. తాము దగ్గరికి వెళ్లి చూసేసరికి విమానం పూర్తి స్దాయిలో కాలిపోతోందన్నారు.

కూలాక నాలుగైదు పేలుళ్లు
ఆ తర్వాత కూడా విమానంలో నాలుగు నుంచి ఐదు పేలుళ్లు జరిగినట్లు తాను చూసినట్లు ఆయన వెల్లడించారు. అప్పుడు విమానంలో ఉన్న వారిని రక్షించేందుకు కూడా తాము ప్రయత్నించినట్లు తెలిపారు. కానీ మంటలు ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యం కాలేదన్నారు. ఇది చాలా బాధాకరమని, మాటల్లో చెప్పలేని విషాదమని ఆయన తెలిపారు. అసలు విమానం రన్ వేపైకి రావడానికి 100 అడుగుల పై నుంచే కుప్పకూలిందన్నారు. దీంతో తాము భయాందోళనకు గురయినట్లు తెలిపారు.

కారణాలివేనా?
లేయర్ జెట్ విమానం బారామతి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించడంతో కుప్పకూలినట్లు భావిస్తున్నారు. దట్టమైన పొగమంచు వల్లే దారి కనిపించక ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విమాన ప్రమాదంపై ఇప్పటికే స్పందించిన డీజీసీఏ విచారణ చేపట్టినట్లు ప్రకటించింది. బ్లాక్ బాక్స్ ఫుటేజ్ ఆధారంగా ఏం జరిగిందో నిర్ధారణకు వస్తామని అధికారులు ప్రకటించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications