అజిత్ దెబ్బ: చేతులు ఎత్తేసిన హీరో, నేనురాను, శశికళకు షాక్
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న శశికళకు గంటగంటకు దిమ్మ తిరిగే షాక్ లు ఎదురౌతున్నాయి.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న శశికళకు గంటగంటకు దిమ్మ తిరిగే షాక్ లు ఎదురౌతున్నాయి.
జయలలితకు ప్రాణానికి ప్రాణం అయిన పోయెస్ గార్డెన్ లోని వేదా నిలయంలో చిన్నమ్మ, ప్రముఖ హీరో అజిత్ భేటీ అవుతున్నారని మంగళవారం ఉదయం అన్నాడీఎంకే పార్టీలోని నెచ్చెలి శశికళ వర్గీయులు ప్రచారం చేశారు.
తాజాగా శశికళతో భేటీ కావడానికి అజిత్ ఆసక్తి చూపించడం లేదని విశ్వసనీయ సమాచారం. అయితే శశికళ, అజిత్ సోమవారం రాత్రి పోయెస్ గార్గెన్ లో కలిశారని అన్నాడీఎంకే పార్టీ ఐటీ వింగ్ మొదట ట్వీట్ చేసింది.

తరువాత మంగళవారం శశికళ, అజిత్ భేటీ అవుతున్నారని మళ్లీ ట్వీట్ చేశారు. ఈ మద్యలో ఏమి జరిగిందో ఏమో కాని అజిత్ మాత్రం శశికళను కలవడం లేదని ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు.
డిసెంబర్ 29వ తేదిన అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమయంలో అజిత్ అభిమానులను శశికళ వైపు తిప్పుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నారని అదే పార్టీలోని ఓ వర్గం ఆరోపించింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత అభిమానులు సీఎం పన్నీర్ సెల్వంకు బహిరంగంగానే సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సమయంలో అజిత్ శశికళను కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications