కొత్త పార్టీ పెట్టడం లేదు, బావోద్వేగానికి గురైన అఖిలేష్ యాదవ్
లక్నో : సమాజ్ వాదీ పార్టీ వస్తృత స్థాయి సమావేశంలో కీలకపరిణామాలు చోటుచేసుకొన్నాయి. కొత్త పార్టీని పెట్టడం లేదని యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. తనపై కొందరు చేసిన విమర్శలు బాదించాయన్నారు.సమావేశంలో బావోద్వేగానికి గురైన అఖిలేష్ కన్నీళ్ళు పెట్టుకొన్నారు. సిఎం పదవి నుండి తప్పుకొనేందుకు తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.అయితే తానంటే కూడ యువతలో క్రేజీ ఉందని ఎస్ పి అధినేత ములాయం ప్రకటించారు.పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల పట్ల ఆయన భాదపడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి అఖిలేష్, శివపాల్ యాదవ్ వర్గాలు హాజరయ్యారు.ఈ సమావేశంలో పాల్గొన్న యూపి ముఖ్యమంత్రి పార్టీలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. పార్టీలో ఇటీవలే పున: ప్రవేశం చేసిన అమర్ సింగ్ తాను సిఎంగా ఉండబోనని చేసిన ప్రకటనపై మనస్థాపం చెందిన విషయాన్ని ప్రస్తావించారు.ములాయం సింగ్ కోరుకొంటే తాను సిఎం పదవి నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.బాబాయ్ శివపాల్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను కొత్త పార్టీ పెడుతన్నట్టు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు.

యూపి సిఎం అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెడుతున్నట్టు తనకు చెప్పారని యూపి ఎస్ పి అధ్యక్షుడు శివపాల్ యాదవ్ చెప్పారు.అయితే కీలకమైన ఈ సమావేశంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకులు మాట్లాడే సమయంలో అఖిలేష్ మద్దతుదారులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.అయితే ఈ ప్రయత్నాలను అఖిలేష్ నిలువరించారు. తన వ్యతిరేక వర్గానికి చెందిన నాయకుల ప్రసంగాలు కొనసాగేలా చూశారు.
పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ములాయం కలత చెందారు. ఏ రకమైన పరిస్థితుల్లో పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరించారు. పార్టీని కాపాడుకొంటూ వచ్చిన పరిస్తితులను ఆయన వివరించారు.విమర్శలను సైతం తట్టుకోలేని నాయకులు ప్రజా నాయకులుగా ఎదిగే పరిస్థితి ఉండదన్నారు ములాయం,
పార్టీలో యువతను ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని భావించాం. అయితే యువతే పార్టీలో సంక్షోభానికి కారణం కారణమైందని ఆయన పరోక్షంగా అఖిలేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.గూండాగిరి చేస్తే సహించేది లేదన్నారు.అందరికంటే ఎక్కువ గుండాగిరి చేసే శక్తి తనకు ఉందన్నారు.తన వెంట కూడ యువత ఉందన్నారు. తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేనే విషయాన్ని ములాయం సమావేశంలో చెప్పారు.ఈ సమావేశానికి హాజరు కావడం ద్వారా క్రమశిక్షణ చర్యలకు గురికాకుండా అఖిలేష్ తప్పించుకొన్నారు.మరో వైపు పార్టీని వీడడం లేదని...కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications