సిఎం ఐనా..: పిన్ని నుండి ముఖ్యమంత్రి పాకెట్ మనీ

Akhilesh gets pocket money from his aunt
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ పాకెట్ మనీ తీసుకోవడమే కాదు.. అదీ తన పిన్నీ నుండి తీసుకుంటారట. అఖిలేష్ యాదవ్ వయస్సు ఇప్పుడు నలభై దాటింది. అంతేకాదు ఆయన భారత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపికి ముఖ్యమంత్రి.

అఖిలేష్‌ను ములాయం తమ్ముడు శివ్‌పాల్ యాదవ్, ఆయన భార్య అన్నీ తామై, సొంత బిడ్డకన్నా మిన్నగా చూశారు. అఖిలేశ్ కూడా పిన్ని తల్లిలా భావించడంతో వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుపోయింది.

చిన్నప్పటినుంచి ఆమె అఖిలేశ్‌కు ఖర్చుల కోసమని పాకెట్ మనీ ఇవ్వడం అలవాటు. అఖిలేశ్ ఇటావాలోని సెయింట్ మేరీస్ స్కూల్ నుంచి సిడ్నీ యూనివర్శిటీ వరకు విద్యాప్రస్థానం పూర్తిచేయడం, ఆనక రాజకీయాల్లోకి రావడం జరిగిపోయాయి. అటుపై ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయినా, నేటికీ పిన్నితో పాకెట్ మనీ ఇప్పించుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+