వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి అభ్యర్థులే..ఎన్నికల్లో పోటీచేయడంలేదు..కారణమదేనా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారు ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు.అయితే ఆయా పార్టీలు విజయం సాధిస్తే ఎంఏల్ సి గా ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారు ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు.అయితే ఆయా పార్టీలు విజయం సాధిస్తే ఎంఏల్ సి గా ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల్లో బుందేల్ ఖండ్ ప్రాంతంలోని రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీచేయాలని భావించారు. కాని చివరి నిమిషంలో ఆయన తన నిర్ణయాన్ని విరమించుకొన్నారు.

<strong>మల్లయోధుడిని మట్టికరిపించాడు,ఎంతైనా నా కొడుకే, శివపాల్ కు దారేది?</strong>మల్లయోధుడిని మట్టికరిపించాడు,ఎంతైనా నా కొడుకే, శివపాల్ కు దారేది?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఆయన మండలి సభ్యుడిగా పదవి కాలం ఇంకా ఉంది.ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది.అందుకే పోటీ చేయడం లేదు.

బిఎస్ పి అధినేత్రి మాయావతి కూడ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు.ఆమె ప్రస్తుతం ఎంపిగా కొనసాగుతున్నారు.గతంలో కూడ ఆమె శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థులే కాని, ఎన్నికల్లో పోటీచేయడం లేదు

ముఖ్యమంత్రి అభ్యర్థులే కాని, ఎన్నికల్లో పోటీచేయడం లేదు

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నవారు ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయడం లేదు.అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం కోసమే సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉన్నందున ఆయన ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని చెప్పారు.కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఈ ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేసుకొని పోటీచేస్తున్నాయి.ఈ కూటమి తరపున అఖిలేష్ ప్రచారం నిర్వహిస్తున్నాడు.బిఎస్ పి అధినేత్రి మాయావతి కూడ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఆమె తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ కూడ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోంది.అయితే ఆర్ ఎల్ డి జయంత్ చౌదరి కూడ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు.

మండలి ద్వారా ముఖ్యమంత్రులుగా

మండలి ద్వారా ముఖ్యమంత్రులుగా

2012 లో బిఎస్ పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే ఆ సమయంలో కూడ మాయావతి ఎంఏల్ సిగానే ఎన్నికయ్యారు. 2007లో కూడ ఆమె ఎన్నికల్లో పోటీచేయలేదు. అయితే ఆ ఎన్నికల్లో బిఎస్ పి అత్యధిక సీట్లను గెలుచుకొంది.దీంతో ఆమె మండలిలో ప్రవేశించారు.తద్వారా ఆమె సిఎంగా అయ్యారు.ఐదేళ్ళ క్రితం సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టింది.తొలుత కనౌజ్ పార్లమెంట్ స్థానంలో ఎంపిగా విజయం సాధించిన అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎంఏల్ సి గా విజయం సాధించారు. ఇంకా ఆయన ఎంఏల్ సి పదవీకాలం ఉంది.కనౌజ్ పార్లమెంట్ స్థానం నుండి అఖిలేష్ తన సతీమణి డింపుల్ ఎంపిగా కొనసాగుతున్నారు.

పార్టీ బాధ్యతల కోసమేనా

పార్టీ బాధ్యతల కోసమేనా

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరు కీలక నాయకులు తమ పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు.ఎన్నికల్లో పోటీ చేస్తే తాను పోటీచేసే నియోజకవర్గాల్లో ప్రచారానికి సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమయం ఇతర నియోజకవర్గాల్లో కేటాయిస్తే మరికొన్ని సీట్లు గెలిచే అవకాశాలుంటాయని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.అందుకే పోటీ చేయడానికి వారు ఆసక్తి చూపడం లేదు.

బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో

బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో

ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి అధికారంలోకివస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాయి.అయితే బిజెపి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు.బిజెపి అత్యధిక సీట్లను గెలిస్తే ఆ పార్టీ అధినాయకత్వం సిఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయించే అవకాశం ఉంది.

English summary
akhilesh and mayavati don't contesting in uttar pradesh elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X