అపర్ణ కోసం అఖిలేష్‌కు చెక్ పెట్టాలనుకుంటే..: ములాయం రెండో భార్య చిచ్చు!

సాధారణంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలు. అందరి దృష్టి ఆ రాష్ట్రంపై ఉంటుంది. ఇప్పుడు ములాయం-అఖిలేష్‌ల మధ్య రగడ నేపథ్యంలో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.

లక్నో: తండ్రీ - కొడుకులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు దేశవ్యాప్తంగా చర్చనీయంశమయ్యాయి. ఇరువురు వేర్వేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, సైకిల్ గుర్తు అఖిలేష్‌ పరమైన నేపథ్యంలో ములాయం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది.

తాను అఖిలేష్ పైన పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. కానీ తాజాగా, తాను సూచించిన కొందరికి టిక్కెట్లివ్వాలని తనయుడికి చెప్పారు.

సైకిల్ అఖిలేష్‌కు రావడం, తాను కొడుకు పైన పోటీ చేస్తానని ములాయం ప్రకటించడంతో ఎస్పీ... రెండుగా చీలిగా పోటీ చేసే అవకాశాలే కనిపించాయి. కాగా, కుటుంబంలో చిచ్చుకు అఖిలేష్ వర్సెస్ అపర్ణ కావడమే కారణంగా చెబుతున్నారు. అయితే, అపర్ణ కోసం అఖిలేష్‌కు చెక్ పెట్టాలనుకున్నప్పటికీ.. కొడుకు పై చేయి సాధించారు.

అసలు గొడవ ఎక్కడ?

అసలు గొడవ ఎక్కడ?

సాధారణంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలు. అందరి దృష్టి ఆ రాష్ట్రంపై ఉంటుంది. ఇప్పుడు ములాయం-అఖిలేష్‌ల మధ్య రగడ నేపథ్యంలో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ములాయం కుటుంబంలో రగడకు ఆధిపత్య పోరే కారణంగా కనిపిస్తోంది.

ములాయం రెండో భార్య పెట్టిన చిచ్చు!

ములాయం రెండో భార్య పెట్టిన చిచ్చు!

ములాయం సింగ్ మొదటి భార్య కొడుకు అఖిలేష్ యాదవ్. మొదటి భార్య మృతి చెందిన తర్వాత ములాయం సాధనా గుప్తను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తనయుడు ప్రతీక్ యాదవ్. సాధనా గుప్త కారణంగానే కుటుంబంలో గొడవలు అని అంటున్నారు.

అఖిలేష్ వర్సెస్ అపర్ణ

అఖిలేష్ వర్సెస్ అపర్ణ

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్. ఆమె ఎంపీగా ఉన్నారు. ఇక, ములాయం రెండో భార్య సాధనా గుప్త తనయుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్. ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ అపర్ణా మాత్రం తెరపైకి వచ్చారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అపర్ణ భావిస్తున్నారు.

అపర్ణకు శివపాల్ మద్దతు

అపర్ణకు శివపాల్ మద్దతు

ఇందులో భాగంగానే అపర్ణా యాదవ్ లక్నో నుంచి పోటీ చేస్తారని ములాయం సింగ్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్.. అపర్ణా యాదవ్‌కు అండగా ఉన్నారు. దీంతో శివపాల్ యాదవ్.. అపర్ణాకు మద్దతుగా, అఖిలేష్ వర్గానికి వ్యతిరేకంగా ములాయంను ఎగదోస్తున్నారని అంటారు.

అపర్ణతో అఖిలేష్‌కు చెక్ పెట్టేందుకు..

అపర్ణతో అఖిలేష్‌కు చెక్ పెట్టేందుకు..

ములాయం ఇంకో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్.. అఖిలేష్ యాదవ్‌కు అండగా ఉంటున్నారు. ఈ కారణంగా సమాజ్ వాది పార్టీలో కుటుంబ చిచ్చు రాజుకుంది. ఇప్పటికే చక్రం తిప్పుతున్న అఖిలేష్ తన చేజారకుండా చూసుకుంటున్నారు. మరోవైపు, అపర్ణ, ఆమె వర్గం యూపీలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గొడవ రాజుకుంది. పార్టీలో అపర్ణతో అఖిలేష్‌కు చెక్ చెప్పాలని ఆమె వర్గం భావిస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+