FASTag alert: కొత్త రూల్స్ తెలుసుకోండి

FASTag: టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ (Fastag) లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషణ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే కోడ్ 176 ఎర్రర్‌ను చూపి లావాదేవీలను తిరస్కరిస్తారు. ఇక, స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్ యాక్టివ్‌కు వెళ్లినా.. ఇదే కారణంతో లావాదేవీని తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్స ఉంటుంది.

Alert for motorists New FASTag rules from February 17

ఒక్క బ్యాలెన్స్ మాత్రమే కాదు.. కేవైసీ వెరీఫికేషన్ పూర్తి చేయకపోవడం, ఛాసిస్ నెంబర్ కు, వెహికిల నెంబర్‌కు మధ్య పొంతన లేకపోవడం వంటి కారణాలతో కూడా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తుంది. ఎన్పీసీఐ ప్రకారం.. రెండు టైమ్ లైన్లు ఉంటాయి. ఫాస్టాగ్ రీడ్ టైంకి 70 నిమిషాల ముందు, రీడర్ టైమ్ తర్వాత 10 నిమిషాలు.. ఈ లిమిట్ దాటితే అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు.

కాగా, ఈ ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జనవరి 28నే ఓ సర్క్యూలర్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తమ ఫాస్టాగ్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకుంటే మంచిది. దీంతో అదనంగా ఛార్జీల చెల్లింపుల నుంచి బయటపడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+