Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'మనిద్దరిది ఒకే మతం.. నాతో ఆ పనిచేస్తేనే న్యాయం చేస్తా'

సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ కానిస్టేబుల్ చేసిన అసభ్యకర పని ఇప్పుడు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. తనపై జరిగిన అత్యాచారంపై న్యాయం చేయమని కోరిన ఓ బాధితురాలితో సదరు కానిస్టేబులు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. తన కోరిక తీర్చాలంటూ వేధించాడు.

అసలేం జరిగిందంటే?
యూపీలో అలీఘర్‌లోని క్వార్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నగ్లా పట్వారీ చౌకీలో ఇమ్రాన్ ఖాన్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. జమాల్‌పూర్‌కు చెందిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి జీషన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని ముఖ్యమంత్రి పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు బాధ్యతలను కానిస్టేబుల్ ఇమ్రాన్ ఖాన్‌కు అప్పగించారు.

Aligarh Shocker Constable Suspended for Demanding Favors from Victim evidence leads to strict action

మనిద్దరిది ఒకే మతం.. ఆ పనికి ఒప్పుకుంటేనే..!
కేసు దర్యాప్తు పేరుతో ఆ మహిళకు ఫోన్ చేసిన ఇమ్రాన్ ఖాన్.. వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. "నువ్వు ముస్లింవే, నేను ముస్లింనే.. మనం మనం ఒక్కటే. నీ కేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే నువ్వు నాతో హోటల్‌కు రావాలి. నా గదికి వచ్చి నాతో పడుకోవాలి. అప్పుడే నీకు న్యాయం జరుగుతుంది, లేదంటే నిన్నే జైలుకు పంపుతాను" అంటూ సదరు కానిస్టేబుల్ బాధితురాలిని బెదిరించాడు. అంతే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బాధితురాలితో ప్రమాణం చేయించి భయపెట్టాడు. ఈద్ పండుగకు బట్టలు కొనిస్తానని.. తన ప్రైవేట్ ఫోటోలు పంపాలని కూడా వేధించాడు.

ఆడియో రికార్డింగ్.. చిక్కిన నిందితుడు
కానిస్టేబుల్ ఆగడాలను భరించలేకపోయిన బాధితురాలు ధైర్యం చేసి అతడితో జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసింది. ఆ రికార్డింగులతో సహా అలీఘర్ ఎస్ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక విచారణలో కానిస్టేబుల్ ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసినట్లు తేలడంతో ఎస్ఎస్పీ అతడిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖ పరువు తీసిన ఆ కానిస్టేబుల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిపై విచారణ కొనసాగుతుండగా.. బాధితురాలికి రక్షణ కల్పించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+