బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్

Bank Holidays: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.

సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున బ్యాంకులు సెలవును పాటిస్తుంటాయి. ఆ రోజున ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా కొనసాగవు. ఆర్థిక సంవత్సరం లావాదేవీలతో కూడిన నివేదికలను రూపొందించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు సెలవు పాటిస్తుంటాయి.

All Banks to remain open on March 31

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడానికి ఎంతో సమయం లేదు. ఇంకో 10 రోజుల్లో అంటే ఈ నెల 31వ తేదీన ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కు తెర పడుతుంది. 31వ తేదీన ఆదివారం కూడా కలిసి రావడంతో సాధారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా మూత పడుతుంటాయి.

దీనికి భిన్నంగా ఈ ఆదివారం నాడు అన్ని బ్యాంకులు కూడా తెరిచి ఉండబోతోన్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలను జారీ చేసింది. నిజానికి- ఈ నెల 29వ తేదీన గుడ్ ఫ్రైడే, నాలుగో శనివారం సెలవు, ఆదివారం కలిసి వచ్చిన విషయం తెలిసిందే.

ఆర్థిక సంవత్సరం ముగింపు నాడు వరుసగా మూడు రోజుల పాటు సెలవు రావడం వల్ల పన్ను చెల్లింపులు, ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఆర్బీఐ.. ఆదివారం నాడు సెలవును రద్దు చేసింది. ఫలితంగా- బ్యాంకులన్నీ ఎప్పట్లాగే తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.

ప్రభుత్వ లావాదేవీలు, చెల్లింపులు, పేమెంట్లు, పన్ను చెల్లింపులకు సంబంధించిన చివరి రోజు కూడా అదే కావడం వల్ల ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న బ్యాంకులన్నీ కూడా మార్చి 31వ తేదీన పని చేయాలని ఆదేశించింది. ఆదాయపు పన్ను శాఖ ఇదివరకే ఆ సెలవులన్నింటినీ రద్దు చేసింది కూడా. ఈ నెల 29 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఎలాంటి సెలవులు ఉండబోవని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+