16వ తేదీ వరకు స్కూల్స్ బంద్..!!

ఢిల్లీ: రోజులు గడుస్తున్నప్పటికీ భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఆయా నదులపై నిర్మించిన బాస్పా, వాంగ్టో, నథ్పా రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు. దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది.

municipalcorporationofdelhi1

అటు దేశ రాజధాని కూడా ఈ భారీ వర్షాలకు అల్లాడిపోతోంది. యమునా నది మహోగ్రరూపాన్ని దాల్చింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. 208. 48 మీటర్లకు చేరింది. ఇది రికార్డ్. గతంలో ఎప్పుడూ ఈ స్థాయికి చేరుకోలేదు యమునమ్మ. రాత్రికి దీని ప్రవాహం మరింత పెరగొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేసింది.

ఎగువన కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల హత్నికుండ్ బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. కాశ్మీరీ గేట్, సీటీఓలను తాకింది వరద నీరు. ఎర్రకోట రోడ్లనూ ముంచెత్తింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునకేశాయి. ఢిల్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు 144 సీఆర్‌పీసీని విధించారు.

schools

లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న మొత్తం 16,564 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఢిల్లీ ప్రభుత్వం. మరో 14,534 మంది నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటోన్నారు. ఢిల్లీ పరిధిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేశారు. సెలవును ప్రకటించారు.

యమునా నదికి ఇప్పట్లో వరద తీవ్రత తగ్గే అవకాశం లేనందు వల్ల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజా ఉత్తర్వులును జారీ చేసింది. తమ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలను ఈ నెల 16వ తేదీ వరకు మూసివేస్తోన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంసీడీ అదనపు డైరెక్టర్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. 16వ తేదీ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్ల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+