ఏప్రిల్ 1న బ్యాంకులు పని చేయవు

ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులు పని చేయవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీన కూడా బ్యాంకులు తెరిచే ఉంటాయని కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ తెలిపింది.

ముంబై: ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులు పని చేయవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీన కూడా బ్యాంకులు తెరిచే ఉంటాయని కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ తెలిపింది.

ఏప్రిల్ 1 వార్షిక ముగింపు దినం. ఈ రోజున కూడా బ్యాంకులు పని చేస్తే ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ యాన్యువల్ క్లోజింగ్ డే రోజు బ్యాంకులు పని చేయవని ప్రకటించింది.

All payment systems to remain shut on April 1

తద్వారా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులకు ఆర్బీఐ ఊరటను ఇచ్చే ప్రకటన చేసింది. ప్రభుత్వ లావాదేవీలతో సంబంధం ఉన్న అన్ని బ్యాంకులు మార్చి 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో సహా పని చేయాలని గత వారం ఆదేశించింది.

ఇందులో మార్పు చేస్తూ ఏప్రిల్ 1న బ్యాంకులు మూసివేయాలని ఆర్బీఐ తాజాగా పేర్కొంది. ఆ రోజు తెరిచి ఉంచడం వల్ల వార్షిక క్లోజర్ సాఫీగా సాగే అవకాశం ఉండదని, ముఖ్యంగా కొన్ని బ్యాంకుల విలీనం ఆ రోజు నుంచి అమలులోకి వస్తున్నందున నిర్ణయంలో మార్పు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+