Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ వర్షాలతో బెంబేలు- రైల్వే స్టేషన్ క్లోజ్: రైళ్లు రద్దు

సిమ్లా: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది.

ప్రత్యేకించి- హిమాచల్ ప్రదేశ్‌ అతలాకుతలమౌతోంది. ప్రధాన నదులు ఉప్పొంగాయి. బియాస్, రావి నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. బియాస్ మీద నిర్మించిన పండో రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. దీనితో అధికారులు అన్ని గేట్లను ఎత్తివేశారు. వరదనీటిని దిగువకు విడుదల చేశారు.

trains

దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి నదుల్లో వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు మునకేశాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. వరద నీటి ధాటికి బియాస్ నది పరీవాహక ప్రాంతం కోతకు గురైంది. కొన్ని నివాసాలు, భవన సముదాయాలు చూస్తుండగానే నదిలో పడిపోయాయి. ఒడ్డున పార్క్ చేసి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి.

trains

వర్షాల ధాటికి రైలు సర్వీసులు అస్తవ్యస్తం అయ్యాయి. సిమ్లా రైల్వే స్టేషన్‌ను అధికారులు పాక్షికంగా మూసివేశారు. సిమ్లా నుంచి కల్కా వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలన్నింటినీ రద్దు చేశారు. ఫలితంగా సిమ్లా రైల్వే స్టేషన్ బోసిపోయింది. ప్రయాణికులు నిరాశగా వెనుదిరిగారు. ఇతర మార్గాల్లో రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. సిమ్లాకు రావాల్సిన రైళ్లను ఇతర స్టేషన్లల్లో నిలిపివేశారు.

మండీ జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన ఓ భారీ వంతెన పేకమేడలా కుప్పకూలింది. వరదనీటిలో కొట్టుకుపోయింది. ఔట్-బంజార్ ప్రాంతాలను అనుసంధానిస్తూ బియాస్ నదిపై 50 సంవత్సరాల కిందట నిర్మించిన ఇనుప వంతెన అది. గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ తట్టుకోగలిగింది.. గానీ ఈ వరదధాటికి మాత్రం నిలవలేకపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+