Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: కనీస కొనుగోలుతో డైమండ్స్ పొందండి.. వాటిని ఎలా వినియోగించాలంటే..?
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇప్పటికే తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి ఎవరూ ఊహించనంతా ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ నెల మొత్తం ఉంటుంది. అమెజాన్‌లో ఏ కేటగిరీ తీసుకుని అందులో షాపింగ్ చేసిన పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు కస్టమర్లకు లభిస్తున్నాయి. అంతేకాదు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో జతకట్టిన అమెజాన్.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై షాపింగ్ చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్ ఇస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్‌తో పాటు మరెన్నో అమెజాన్‌పై పొందొచ్చు.
ఇక అమెజాన్ కస్టమర్లు డబ్బులను ఆదా చేసేందుకు ఈ దిగ్గజ సంస్థ సరికొత్త మార్గంను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మీరు అమెజాన్ వేదికగా వస్తువులు కొనుగోలు చేసి ఉంటే డైమండ్స్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తున్నట్లు గుర్తించి ఉంటారు. డైమండ్స్ అనేవి మీకు అదనంగా లభించే పాయింట్లు మాత్రమే కాదు.. వీటిని వినియోగించి గేమ్స్ ఆడొచ్చు, మినీ టీవీని వీక్షించొచ్చు, అమెజాన్‌పై జరిగే ఇతర యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా మీరు కొనుగోలు చేసే వస్తువులకు కూడా ఈ పాయింట్లను రిడీమ్ చేసుకుని వినియోగించుకోవచ్చు.
అమెజాన్‌పై డైమండ్స్‌ను వినియోగించి డిస్కౌంట్ పొందడం ఎలా..?
అమెజాన్ యాప్ హోమ్ పేజ్‌పై డైమండ్స్ కోసం చూడండి
డైమండ్స్ వినియోగించి ఏ వస్తువులు అయితే కొనుగోలు చేయొచ్చో ఓ జాబితా కనిపిస్తుంది
డైమండ్స్‌ను మార్చి మీకు నచ్చిన ఆఫర్‌ను ఎంపిక చేసుకుని ఆ తర్వాత వచ్చే కూపన్‌ను పొందండి
కనీస కొనుగోలు ధర చేసినట్లయితే ఈ కూపన్ ఆటోమేటిగ్గా మీ వస్తువుకు అప్లయ్ అవుతుంది. డిస్కౌంట్ వస్తుంది.
ఇప్పటి వరకు మీరు పొందిన డైమండ్స్‌ను క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు కనీసం రూ.3వేలుతో షాపింగ్ చేస్తే 1500 డైమండ్లు వినియోగించి రూ.300 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఎన్ని ఎక్కువ డైమండ్లు పొందితే అంత ఎక్కువ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉన్నంతవరకు మాత్రమే ఉంటుంది.













Click it and Unblock the Notifications