ఏం తేలుస్తారు?: చందా కొచ్చర్ భవితవ్యంపై సందిగ్ధం, సమావేశం కానున్న బోర్డు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐలో చందాకొచ్చర్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వీడియోకాన్ క్విడ్ ప్రో కో ఆరోపణలపై ఐసీఐసీఐ ఆమెకు అండగా నిలబడినా.. బోర్డు సభ్యుల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఈవో, ఎండీ పదవుల్లో ఆమె కొనసాగడంపై తాజాగా కొంతమంది సభ్యులు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. మరికొంతమంది మాత్రం చందా కొచ్చర్ కు అండగా నిలబడినట్టు తెలుస్తోంది. మొత్తం 12మంది సభ్యులు ఉన్న ఐసీఐసీఐలో ఆమెకు అండగా నిలిచిందెవరు?.. వ్యతిరేకించిందెవరు? అన్నది మాత్రం వెల్లడి కాలేదు.

రాజీనామా చేస్తారా?
ఈ నేపథ్యంలో చందా కొచ్చర్ భవితవ్యంపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నట్టు సమాచారం. సమావేశం అనంతరం చందా కొచ్చర్ రాజీనామా చేస్తారా?.. లేక కొనసాగుతారా? అన్న దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నిర్ణయం ఆమెకే వదిలేసిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా కొచర్ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ఇప్పటికైతే రాజీనామాపై ఐసీఐసీఐ బోర్డు.. నిర్ణయాన్ని ఆమెకే వదిలేసింది.
ఇకముందు కూడా ఇలాగే వ్యవహరిస్తుందా?.. లేక కఠిన నిర్ణయాలు తీసుకుని ఆమెను సాగనంపుతుందా? అన్నది వేచి చూడాలి.
కాగా, బోర్డులో ఉన్న 12మంది సభ్యుల్లో.. ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ కాగా.. ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు.

క్విడ్ ప్రో కో:
వీడియోకాన్ గ్రూపుకు రూ.3250కోట్లు రుణం మంజూరు చేసిన చందా కొచ్చర్.. ఇందుకు గాను వ్యక్తిగత లబ్ది పొందారన్న ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. వీడియోకాన్ గ్రూపు యాజమాన్యంతో చందాకొచ్చర్ భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో వీడియోకాన్ రుణ విషయంలో అవకతవకలు ఉండొచ్చని, సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతోంది.

ఆమెకు తెలియదు:
వీడియోకాన్ గ్రూపుతో వ్యాపార సంబంధాలపై రెండు రోజుల క్రితం స్పందించిన దీపక్ కొచ్చర్.. ఈ వ్యవహారం చందా కొచ్చర్‌కు తెలియదని పేర్కొనడం గమనార్హం. వీడియోకాన్ గ్రూపుతో తన 50:50 డీల్, నుపవర్ రినెవెబుల్స్ సంస్థ ఏర్పాటు గురించి ఆమెకు తెలియదన్నారు.
ధూత్ రాజీనామా చేసిన 22ఏళ్ల తర్వాత ఆ విషయాన్ని ఆమెతో చెప్పినట్టు వెల్లడించారు. ధూత్ ఇతర బిజినెస్(ఆయిల్&గ్యాస్)తో బిజీ అవడం వల్లే నువపర్ నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications