ఈ అకౌంట్‌కు డబ్బులు పంపింతే పుణ్యం కాదు.. పాపం చుట్టుకుంటుంది: ప్రధాని పేరు మీద ఫేక్ యూపీఐ ఐడీ..!

న్యూఢిల్లీ: సంక్షోభంలో అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు కొందరు ఘనులు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా నివారణ చర్యల కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి ఆర్థికంగా కొద్ద, గొప్పో సహాయం చేయడానికి ప్రజలు దేశవ్యాప్తంగా సానుకూలంగా స్పందిస్తున్నారు. తమకు తోచిన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి పంపిస్తున్నారు.

దీన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కక్కుర్తిగాళ్లు. ఏకంగా ప్రధానమంత్రి పేరు మీదే ఓ నకిలీ యూపీఐ ఐడీని సృష్టించారు. కరోనా వైరస్ బాధితుల ఆదుకోవడానికి కేంద్రం చేపట్టిన సహాయక చర్యల కోసం విరాళాలను పంపించే వారు ఫలానా ఐడీలో డబ్బులను జమ చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ నకిలీ యూపీఐ ఐడీని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆ నకిలీ ఐడీ pmcare@upi.

Amid lockdown: Beware of this fake ID which asks you to contribute towards PM Cares Fund

దీనికి జమ చేసిన విరాళాలు ఆ నకిలీ ఖాతాను సృష్టించిన వాడి జేబుల్లోకి వెళ్తాయే తప్ప.. ప్రధానమంత్రి సహాయనిధికి చేరదు. ఈ ఐడీ కాస్తా నకిలీదని అధికారులు గుర్తించారు. ఈ యూపీఐ ఐడీకి దాతలు ఎవరూ విరాళాలను పంపించవద్దని కేంద్ర ప్రభుత్వ అధికారులు సూచించారు. అసలు ఐడీ pmcare@sbi. దీనికి మాత్రమే విరాళాలను పంపించాలని కోరారు. భుబనేశ్వర్ కుమార్ అనే వ్యక్తి ప్రధానమంత్రి పేరు మీద నకిలీ ఐడీని సృష్టించిట్లుగా నిర్ధారించారు. అతణ్ని ఇప్పటికే అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+