వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమీర్ స్థానంలో అమితాబ్: 'నిర్ణయాన్ని గౌరవిస్తా'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: అమీర్‌ఖాన్ స్థానాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ భర్తీ చేయనున్నారు. భారత పర్యాటక రంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధమైంది.

ఇప్పటివరకు ప్రచారకర్తగా వ్యవహరించిన మరో బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌ ఒప్పంద కాలపరిమితి ముగియడంతో తొలగిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆ స్థానాన్ని తొలిప్రాధాన్యంగా అమితాబ్‌ బచ్చన్‌తో భర్తీ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.

Amitabh Bachchan may replace Aamir Khan as face of Incredible India

ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు అమితాబ్ బచ్చన్ వైపే మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది. కాగా, బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తప్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆమీర్‌ ఖాన్‌ తెలిపారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యక్రమానికి ఇంతకాలం అంబాసిడర్‌ ఉండడం నా అదృష్టం. ఈ విధంగా నా దేశానికి సేవ చేసినందుకు సంతోషంగా ఉంది. దేశం కోసం చేసిన ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలలో నేను ఒక్క పైసాకూడా తీసుకోకుండా నటించాను. ఇకపై నేను ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాలా లేదా అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం ఎవరిని ప్రచార కర్తగా నియమించినా వారి నిర్ణయాన్ని గౌరవిస్తా. నేను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నా లేకపోయినా ఇండియా మాత్రం ఎల్లప్పుడూ ఇన్‌క్రెడిబుల్‌గానే ఉంటుంది. దేశ హితం కోసం సర్వదా సిద్ధంగా ఉంటాను' అని చెప్పారు.

English summary
Aamir Khan’s loss may be Amitabh Bachchan’s gain. The 73-year-old superstar emerged on Thursday as the frontrunner for the government’s ‘Incredible India’ campaign, a day after the Centre decided to not renew Khan’s contract for the flagship scheme to promote tourism in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X