VIDEO రూ.22 వేల కోట్లు ట్రాన్స్ ఫర్..? షా స్విస్ అకౌంట్ నుంచి రాజగోపాల్ రెడ్డికి..మాణిక్కం ఠాగూర్
మునుగోడు బై పోల్ వేళ కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అవును విమర్శలు కొత్తబాట పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు లొంగిపోయి.. ఆయన పార్టీ మారారని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు.

అమిత్ షా గూగుల్ పే..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గూగుల్ పే ద్వారా రూ.22,000 కోట్లు చెల్లించినట్టు క్రియేట్ చేశారు. దానిని ఠాగూర్ పోస్ట్ చేశారు. బీజేపీలోకి వెల్ కం చెబుతూ మొత్తాన్ని పంపించారని అందులో ఉంది. ఈ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి జరిగిన పరిణామాలను ఠాగూర్ అందులో పేర్కొన్నారు.

మోడీ- షా కలిసి
వీడియోలో ముందుగా గూగుల్ పే స్క్రీన్‌పై మోడీతో కలిసి ఉన్న అమిత్ షా ఫొటో కనిపిస్తుంది. తర్వాత ఆర్‌జీ పాల్ పేరు కొట్టగానే... రాజగోపాల్ రెడ్డి ఖాతా కనిపిస్తుంది. ఆ ఖాతాకు 22,000 కోట్లను ఎంటర్ చేసిన అమిత్ షా... వెల్‌కమ్ టూ బీజేపీ అని టైప్ చేసి పిన్ ఎంటర్ చేస్తారు. స్విస్ బ్యాంకు ఖాతా నుంచి కోమటిరెడ్డి ఖాతాకు రూ.22,000 కోట్లు జమ చేస్తారు.

రిసివ్డ్ షా జీ
అంతేకాదు ఆ తర్వాత ఈ మొత్తాన్ని స్వీకరిచించినట్టు కోమటిరెడ్డి రిసీవ్‌డ్ అని ఆ వీడియోలో మెసేజ్ పెట్టారు. అంతకుముందు థ్యాంక్యూ అంటూ అమిత్ షాకు కృతజ్ఞతలు అందులోనే చెప్పారు. ట్రాన్సాక్షన్‌కు సంబంధించి ఓ స్క్రాచ్ కార్డు రాగా... దానిని ఓపెన్ చేస్తారు. అందులో బెటర్ లక్ నెక్ట్స్ టైమ్, మునుగోడు నాట్ ఫర్ సేల్ అనే సందేశం కనిపిస్తుంది.
ఫన్నీగా వీడియో
ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంది. నిజంగానే అంతమొత్తం నగదు పంపించారా అనే సందేహం కలుగుతుంది. కానీ రోజుకు రూ.లక్ష కన్నా ఎక్కువగా గూగుల్ పే, పోన్ పే ద్వారా పంపించడం వీలు పడదు. కానీ 22 వేలు రాసి.. దాని పక్కనే సీఆర్ అని రాశారు. అదీ అబద్దం అని తెలిసిన సరే అంతా చూస్తున్నారు. లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications