Amritpal Singh: దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన అమృత్ పాల్ సింగ్ భార్య.. అడ్డుకున్న అధికారుల..
ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను దేశం విడిచి వెళ్లకుండా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. కిరణ్‌దీప్ కౌర్ గురువారం అమృత్‌సర్‌లోని గురురామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కిరణ్‌దీప్ కౌర్ బ్రిటిష్ పౌరురాలిగా ఉన్నారు.
పోలీసులు అమృతపాల్ సింగ్ భార్యపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు కిరణ్‌దీప్ కౌర్‌ను ఆపివేశారని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు బర్మింగ్‌హామ్‌కు బయలుదేరేందుకు అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ 117 ఎక్కేందుకు ఆమెను సిద్ధమయ్యారు.

కౌర్ మధ్యాహ్నం 12.20 గంటలకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ అధికారులు ఆమెను ప్రశ్నించడానికి ఆపారు. ఈ క్రమంలోనే ఆమెపై లుక్ అవుట్ నోటీసు ఉన్నట్లు గుర్తించి ప్రయాణానికి అనుమతించలేదు. కిరణ్‌దీప్ కౌర్‌ని జల్‌పూర్ ఖేరాలోని ఆమె ఇంటికి పంపామని, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లవద్దని కోరినట్లు అధికారులు తెలిపారు.
"మేము ఆమెను దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకున్నాం. ఆమెను నిర్బంధించలేదు లేదా అరెస్టు చేయలేదు. కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆమె అవసరం కాబట్టి ఆమెను ఆపారు" అని అమృత్‌సర్ రూరల్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సతీందర్ సింగ్ తెలిపారు.
కిరణ్‌దీప్ కౌర్‌కు భారత్ లో ఉండడానికి పరిమత కాల వీసా మాత్రమే ఉంది. త్వరలో వీసా గడువు ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమృతపాల్ సింగ్‌ను వివాహం చేసుకున్న ఆమె ఆ తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్‌కు వెళ్లడానికి ప్రయత్నం చేసింది. ఆమెను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అమృత్‌పాల్ సింగ్‌భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి..? అనే విషయాలపై కిరణ్‌దీప్ ను ఆరా తీస్తున్నట్టు సమాచారం.ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని ఆచూకీ కోసం భదత్రా బలగాలు, పంజాబ్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతను వాహనాలు, వేషాలు మారుస్తూ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృత్‌పాల్ పేరుతో ఓ వీడియో బయటికొచ్చిన విషయం తెలిసిందే. తాను దేశం నుంచి పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు మళ్లీ వస్తానని ఆ వీడియో సందేశం పంపాడు.












Click it and Unblock the Notifications