ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం...
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం తప్పింది. దీంతో ఫ్లైట్ టెయిల్ సెక్షన్ దెబ్బతిన్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
పూర్తి వివరాల ప్రకారం... ఈ నెల 9వ తేదిన 6E 6054 నెంబర్ కలిగిన ఇండిగో విమానం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే, టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా విమానం టెయిల్ సెక్షన్ రన్‌వేను తాకింది. దీంతో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇక, ఈ సంఘటనలో టెయిల్ సెక్షన్ పెయింట్ ఊడిపోయి పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం చేరవేశాడు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానం ల్యాండ్ చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ తోక భాగం రన్‌వేకు టచ్ కావడం వల్ల టెయిల్ స్ట్రైక్ జరుగుతుందని, అది అత్యంత ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు. ఇలాంటి ప్రమాద సమయంలో ఒక్కోసారి తీవ్రమైన మంటలు చెలరేగి ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అదృష్టవశాత్తు అలాంటి సంఘటనలేవీ జరగలేదని ఎయిర్‌పోర్టు వర్గాలు వివరించాయి. ఈ సంఘటనపై రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. ఇక, ప్రయాణికులను దింపి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications