ఆసుపత్రిలో నర్సులు, లేడీస్ బాత్ రూమ్ లో కెమెరాలు, యువతితో సైకో అంబులెన్స్ డ్రైవర్ !

బెంగళూరు/మైసూరు: ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు కామంతో రగిలిపోతున్నాడు. ఆసుపత్రిలో సాటి ఉద్యోగి మరదలు మీద కన్ను వేసిన అంబులెన్స్ డ్రైవర్ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. అంబులెన్స్ డ్రైవర్ తన మరదలికి చిత్రహింసలు పెడుతున్నాడని తెలుసుకున్న అదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఆమె బావకు తెలిసి అతను రగిలిపోవడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

కర్ణాటకలోని మైసూరు సిటీలో మైసూరు మెడికల్ కాలేజ్ లోని ట్రామా సెంటర్ లో సందేష్ అనే యువకుడు అంబులెన్స్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో మహేష్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. సెక్యూరిటీగార్డు మహేష్ కు అందమైన మరదలు ఉంది, మహేష్ భార్య చెల్లెలు కూడా వారి ఇంటిలోనే ఉంటున్నది. ఒకే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్ సందేష్, సెక్యూరిటీ గార్డు మహేష్ కు పరిచయం ఉంది.

An ambulance driver who sexually assaulted a young woman and tried to kill her brother-in-law

సెక్యూరిటీ గార్డు మహేష్ కోసం ఆసుపత్రికి వచ్చి వెలుతున్న అతని భార్య, మరదలిని అంబులెన్స్ డ్రైవర్ సందేష్ చూశాడు. మహేష్ మరదలి మీద కన్ను వేసిన అంబులెన్స్ డ్రైవర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇదే సందర్బంలో మహేష్ మరదలితో మాటలు కలుపుతూ ఆమెను అప్పుడప్పుడు మాట్లాడుతున్న అంబులెన్స్ డ్రైవర్ సందేష్ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడని తెలిసింది.

విషయం బయటకు తెలిస్తే గొడవలు అవుతాయని అనుకున్న ఆమె సైలెంట్ గా ఉందని తెలిసింది. అయితే మౌనం అంగీకారం అనుకున్న డ్రైవర్ సందేష్ ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు మహేష్ కోపంతో డ్రైవర్ సందేష్ మీద తిరగబడ్డాడు. ఆ సందర్బంలో డ్రైవర్ సందేష్ సెక్యూరిటీ గార్డు మహేష్ మీద దాడి చేశాడు.

An ambulance driver who sexually assaulted a young woman and tried to kill her brother-in-law

సెక్యూరిటీగార్డు మైసూరు మెడికల్ కాలేజ్ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో అంబులెన్స్ డ్రైవర్ సందేష్ ను ఉద్యోగం నుంచి తప్పించారు. ఇదే విషయంలో కోపం పెంచుకున్న మహేష్, అతని స్నేహితులు కలిసి పక్కాప్లాన్ తో సెక్యూరిటీ గార్డు మహేష్ ను మైసూరు సిటీ శివార్లలోని బండిపాళ్య సమీపంలోకి పిలుచుకుని వెళ్లి అతని మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి అతని కుడిచేతిని విరిచేశారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ సందేష్ తో పాటు అతని స్నేహితుల మీద కేసు నమోదు చేశారు.

గతంలో మైసూరులోని కేఆర్ ఆసుపత్రిలో సందేష్ డ్రైవర్ గా పని చేసేవాడు. ఆ సందర్బంలో లేడీస్ బాత్ రూమ్ లో సీక్రేట్ కెమెరాలు ఫిట్ చేసిన కామాంధుడు సందేష్ తరువాత నర్సులు, ఆసుపత్రికి వచ్చే వెళ్లే మహిళలు బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో వారి అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తూ అడ్డంగా చిక్కిపోయాడు. కేఆర్ ఆసుపత్రి సిబ్బందికి సందేష్ చిక్కిపోవడంతో అతన్ని అక్కడి నుంచి ఉద్యోగంలో నుంచి తీసేశారని, తరువాత మైసూరు మోడికల్ కాలేజ్ లో డ్రైవర్ గా ఉద్యోగంలో చేరి అక్కడా అదే తీరుకొనసాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+