కాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్: ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ వీరమరణం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులు, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌ను పొట్టనబెట్టుకున్నారు. తామే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఇది పని చేస్తోన్నట్లు తేలింది.
అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ సమీపంలోని గడోలే ప్రాంతంలో రెసిస్టెన్స్ ఫ్రంట్ టెర్రరిస్టులు భారీ సంఖ్యలో మకాం వేసినట్లు పక్కా సమాచారం అందడంతో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎన్‌కౌంటర్‌కు దిగారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎదురు కాల్పులు కొనసాగుతూ వచ్చాయి.

ఈ తెల్లవారు జామున ఎదురుకాల్పులను పునఃప్రారంభించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశీష్.. దీనికి సారథ్యాన్ని వహించారు. ఎదురు కాల్పుల్లో మన్‌ప్రీత్ సింగ్, ఆశీష్‌తో పాటు అనంతనాగ్ డీఎస్పీ హుమయూన్ భట్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
A truly shattering loss.
— Shiv Aroor (@ShivAroor) September 13, 2023
Colonel Manpreet Singh
Major Ashish Dhonchak
DSP Humayun Bhat.
The heroes of Anantnag. My deepest condolences to the families, Army & J&K Police. 💔 pic.twitter.com/KZlwsuwC5m
వారి పరిస్థితి విషమించడంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సను అందించారు. వారి ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముగ్గురూ అమరులయ్యారు. వారు కన్నుమూసిన విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
Deeply saddened by the loss of Colonel Manpreet Singh, DySP Humayan Bhat of @JmuKmrPolice, and Major Aashish Dhanchak during an encounter with terrorists today at #Kokernag, #Anantnag.
— Wajahat Farooq Bhat (@Wajahatfarooqbt) September 13, 2023
My heartfelt condolences go out to their grieving families and esteemed colleagues.
In this… pic.twitter.com/vrMZy6cIag
రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ కల్నల్ స్థాయి అధికారి. కోకెర్‌నాగ్, గడోలేలో రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిన తరువాత యుద్ధ ప్రాతిపదికన ఆయన వ్యూహాలను రూపొందించారు. వారు మకాం వేసిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాశ్మీర్ పోలీసులను సమన్వయం చేసుకుంటూ ఈ ఎన్‌కౌంటర్‌ను ముందుండి నడిపించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications