అధికార పార్టీ ఎమ్మెల్యేతో ?, హోటల్ లో ప్రతిపక్ష నాయకుడికి సినిమా చూపించి ఎస్కేప్, అంతలోనే!

హఠాత్తుగా హోటల్‌లోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులు బీజేపీ నేతపై దాడి చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రవాతి పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బీజేపీ నాయకుడి ఇంటి ముందు పార్క్ చేసిన కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. బీజేపీ నాయకుడి మీద దాడి చెయ్యడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో దుండగుల ఆగడాలు కొనసాగుతున్నాయి, శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగర్‌లో పోలీసులకు భయపడకుండా బీజేపీ నేతపై బహిరంగంగా దాడికి పాల్పడ్డారు. భద్రావతి నగర్‌లోని బీహెచ్‌ రోడ్డులోని ఫేమస్ హోటల్‌ కంచన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనాల పార్శిల్ తీసుకోవడానికి హోటల్‌కు వచ్చిన బీజేపీ నేత గోకుల్‌ కృష్ణన్‌పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు.

An assassination attempt has been made on a BJP leader in Hota in Karnatakas Shivmogga district

హోటల్‌లోని గోకుల్ కృష్ణన్‌పై దుండగులు జగ్గులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ నేత గోకుల్ తీవ్రంగా గాయపడ్డారు. గోకుల్ నుదుటిపైన, చెవులపై, తల తదితర భాగాల్లో తీవ్రగాయాలై రక్తస్రావమైంది. గాయపడిన గోకుల్ కృష్ణన్‌ను భద్రావతి తాలూకా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆరుగురు వ్యక్తులు హఠాత్తుగా హోటల్‌లోకి ప్రవేశించి బీజేపీ నేత గోకులపై దాడి చేశారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఓల్డ్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. అలాగే బీజేపీ నాయకుడు గోకుల్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును దుండగులు ధ్వంసం చేశారు. బీజేపీ నాయకుడు గోకుల్ భద్రావతిలో జరుగుతున్న అక్రమ వ్యాపారాల గురించి, అక్రమ దందా గురించి అతని ఫేస్‌బుక్‌లో సమాచారాన్ని పంచుకున్నాడని, అనేక పోస్టులు చేశాడని తెలిసింది. భద్రావతి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర్ అక్రమ వ్యాపారంపై బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు.

ఈ సమాచారాన్ని బీజేపీ నాయకుడు గోకుల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది ఇదే విఫయంలో బీజేపీ నాయకుడు గోకుల్ కారు ధ్వంసమైంది. బీజేపీ నేత గోకుల్ పై దుండగులు దాడి చేశారు. దాడి తరువాత, తప్పించుకున్న దుండగులు ఆ హోటల్ నుండి తప్పించుకున్నారని, పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో బీజేపీ నాయకుల మీద దాడులు ఎక్కువ అవుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం బీజేపీ నాయకుల ఆరోపణలను ఖండిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+