Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్న కెమెరామెన్, భార్య ఫోన్ నుంచి మెసేజ్ చేసి పిలిపించిన భర్త ?

చెన్నై/మధురై: ఓ యువకుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. సినిమా షూటింగ్ లు లేని సమయంలో సొంతఊరుకు వెళ్లి అక్కడే కాలం గడుపుతున్నాడు. ఈ యువకుడికి ఓ ప్రియురాలు ఉంది. అయితే ప్రియురాలికి వివాహం అయిపోయినా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్తకు అతని భార్య, అసిస్టెంట్ కెమెరామెన్ అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసిపోయింది.

తమిళనాడులోని మధురైలోని జైహింద్ పురంలో శరవణ (32) అనే యువకుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ముంబాయి వెళ్లిన శరవణ బాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. మేలూరు సమీపంలోని తిరువాడవూర్ లో నివాసం ఉంటున్న మాలతి అనే యువతిని శరవణ ప్రేమించారు. చాలాకాలం పాటు శరవణ, మాలతి కలిసి తిరిగారు.

An assistant cameraman who had an affair with a married woman, The husband who killed his wifes boyfriend in Secret Place.

అయితే మూడు సంవత్సరాల క్రితం మాలతికి శివగంగై జిల్లా కాటానిపట్టికి చెందిన లారీ డ్రైవర్ శక్తివేల్‌తో వివాహం అయ్యింది. శక్తివేల్, మాలతి దంపతులకు ఏడాదిన్నర వయసు ఉన్న కుమార్తె ఉంది. వివాహం అయిన తరువాత కూడా మాలతి, శరవణ టచ్ లో ఉన్నాడు. సినిమా షూటింగ్ లు లేని సమయంలో మధురై వస్తున్న శరవణ అతని ప్రియురాలు మాలతిని పిలుపించుకుని ఆమెతో కలిసి తిరుగుతున్నాడు.

వివాహం జరిగిన తరువాత కూడా మాలతి ఆమె మాజీ ప్రియుడు శరవణతో అక్రమ సంబంధం కొనసాగించింది. భార్య మాలతి అక్రమ సంబంధం గురించి ఆమె భర్త శక్తివేల్ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని భార్య మాలతిని శక్తివేల్ హెచ్చరించాడు. అయితే మాలతి మాత్రం ఆమె ప్రియుడు శరవణతో టచ్ లో ఉందని తెలిసింది.

ఇటీవల మధురై వెళ్లిన శరవణ బైక్ లో వెళ్లి తరువాత ఇంటికి చేరుకోలేదు. శరవణ సోదరి రాజేశ్వరి తన తమ్ముడు కనపడటం లేదని మధురైలోని జైహింద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు అసిస్టెంట్ కెమెరామెన్ శరవణ కోసం గాలించారు. తిరువాడవూర్ ప్రాంతంలో శరవణ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. శరవణ వెళ్లిన బైక్ క్వారిలోని గుంతలో పడి ఉండటంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శరవణకు చివరిసారిగా మాలతి ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. మాలతిని విచారణ చెయ్యగా శరవణతో అక్రమ సంబంధం ఉందని బయటపడింది. మాలతి భర్త శక్తి వేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా శరవణను హత్య చేసిన అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

భార్య మాలతి మొబైల్ ఫోన్ నుంచి శరవణకు మెసేజ్ చేసిన శక్తివేల్ అతన్ని నిర్జనప్రదేశంలోకి పిలిపించుకుని బావ మురుగన్, బావ మరదిది రాజాప్రభుతో కలిసి శరణను హత్య చేసి క్వారీ సమీపంలో పూడ్చేశామని నిందితులు అంగీకరించారని పోలీసులు అన్నారు. అసిస్టెంట్ కెమెరా మెన్ శరవణ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టుంకు తరలించారు. శరవణ హత్య కేసులో అతని ప్రియురాలు మాలతి భర్త శక్తివేల్, మురుగన్, రాజాప్రభును అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+