Viral Video: వినాయకుడిపై భక్తిని చాటుకున్న ఏనుగు.. వీడియో వైరల్..
పూజుల్లో మొదటి పూజ వినాయకుడికి చేస్తారు. అందుకే గణపతి దేవుడిని ఆది దేవుడు అంటారు. ఈ రోజు వినాయకచవితి కావడంతో దేశం అంతా పండుగ శోభా సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గల్లీ గల్లీకి వినాయకుడి విగ్రహం పెట్టి పూజిస్తున్నారు. అయితే దేవుడిపై భక్తి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినాయకచవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని తీసుకెళ్తున్న క్రమంలో వినాయకుడికి ఏనుగు దండ వేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీశారు. ఈ వీడియోను పూజ నిక్కాం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పోస్టుతో పాటు ఇది చాలా అందంగా ఉందని రాసుకొచ్చింది.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 81 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 9 వేలకు పైగా లైక్స్ రాగా 1000 కి పైగా రీట్వట్లు చేశారు. ఈ వీడియో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జై గణేష్ అంటూ ఒకరు.. గణపతి పప్పా మోరియా అంటూ మరొకరు కామెంట్ చేశారు.ే
This is beautiful ...😍#गणपती_बाप्पा_मोरया 🙏 pic.twitter.com/Xh4MYifIMA
— Pooja Nikam 🇮🇳 (@poojanikam20) August 30, 2022












Click it and Unblock the Notifications