Delhi: వాషింగ్ మెషన్‍లో పడి.. 7 రోజులు కోమాలో ఉండి బయటపడిన చిన్నోడు..

ఏడాదిన్నర వయస్సున్న బాలుడు 7 రోజులు కోమాలో ఉండి బయటకొచ్చిన ఘటన ఢిల్లీలో జరిగింది.

వాషింగ్ మెషీన్‌లోని సబ్బు నీటిలో పడి 15 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయిన ఏడాదిన్నర బాబు మృత్యువుతో పోరాడి మృత్యుంజేయుడిగా బయటపడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. బాలుడు ఏడు రోజుల పాటు కోమాలో ఉండి బతికి బయటపడ్డాడు. 12 తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. బాలుడు బాగున్నాడని వసంత్‌ కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని వైద్య తెలిపారు.

15 నిమిషాలు

15 నిమిషాలు

13 రోజుల క్రితం వసంత్‌కుంజ్‌కు చెందిన ఓ మహిళ టాప్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషిన్‌లో దుస్తులు వేసి ఆన్‌ చేసి వెళ్లింది. ఆమెకు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. అతను వాషింగ్ మెషిన్ వద్దకు ఎలా వెళ్లాడో తెలియదు.. కానీ అతను అందులో పడిపోయాడు. 15 నిమిషాల తర్వాత బాబు కనిపించకపోయేసరికి తల్లి వెతుకుతూ వాషింగ్ మెషిన్ లో బాలుడు ఉన్నట్లు గుర్తించి వెంటనే బయటకు తీసింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

నీలం రంగులోకి శరీరం

నీలం రంగులోకి శరీరం

ఆస్పత్రికి వచ్చినప్పుడు "బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను నీలం రంగులోకి మారాడు. అతని హృదయ స్పందన బలహీనంగా ఉంది. పల్స్ లేదు" అని నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ నాగ్‌పాల్ చెప్పారు. మూత తెరిచి ఉన్న టాప్‌లోడింగ్ వాషింగ్ మెషీన్‌లో బిడ్డ సబ్బు నీటిలో సుమారు 15 నిమిషాలు గడిపినట్లు తల్లి చెప్పిందని డాక్టర్ తెలిపారు. బాలుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని పీడియాట్రిక్స్ విభాగంలో కన్సల్టెంట్ డాక్టర్ హిమాన్షి జోషి తెలిపారు.

న్యుమోనియా

న్యుమోనియా

"సమయ వ్యవధి బహుశా 15 నిమిషాల కంటే తక్కువగా ఉండవచ్చు, లేకుంటే అతను జీవించి ఉండలేడు" అని డాక్టర్ నాగ్‌పాల్ అన్నారు. అప్పుడు కూడా అతను సజీవంగా ఉండటం నిజంగా ఒక అద్భుతమని పేర్కొన్నాడు. "సబ్బు నీటి కారణంగా, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతతో సహా అతని వివిధ అవయవాల పనితీరు ప్రభావం చూపింది. ఇది బ్యాక్టీరియా న్యుమోనియాకు దారితీసింది. తరువాత, అతను జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్‌తో కూడా బాధపడ్డాడు" అని డాక్టర్ జోషి చెప్పారు. పిల్లవాడికి అవసరమైన యాంటీబయాటిక్స్, IV ఫ్లూయిడ్ సపోర్ట్ అందించామని, ఆ తర్వాత అతను కోలుకోవడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. నెమ్మదిగా, అతను తన తల్లిని గుర్తించడం ప్రారంభించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+