బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Criminal: వీడు ఎంత కేటుగాడు అంటే ?, పెరోల్ మీద వచ్చి 15 ఏళ్లు చిక్కకుండా తప్పించుకుని ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హీరోలు, విలన్లు పోలీసులకు చిక్కకుండా సంవత్సరాలు సంవత్సరాలు తప్పిచుకుని తిరగడం మనం సినిమాల్లోనే చూసి ఉంటాము. లక్ష రుపాయలు రివార్డు ప్రకటించినా పోలీసులకు చిక్కకుండా అదే రాష్ట్రంలో ఓ క్రిమన్ 15 ఏళ్లు తలదాచుకున్నాడు. ఒక కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జైల్లో ఉన్న నిందితుడు పెరోల్ మీద బయటకు వచ్చి మాయం అయ్యాడు. 15 ఏళ్ల నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 1 లక్ష బహుమానం అందిస్తామని పోలీసు అధికారులు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రకటించారు. అయినా కేటుగాడు మాత్రం పోలీసులకు చిక్కలేదు. అయితే ఆయుర్వేదిక ఔషదాల కారణంగా నిందితుడు పోలీసులకు చిక్కిపోయాడు.

lady: ఫైవ్ స్టార్ హోటల్ లో నగ్నంగా బయటకు వచ్చిన విదేశీ మహిళ, జుట్టుపట్టుకుని చితకబాదేసి ?lady: ఫైవ్ స్టార్ హోటల్ లో నగ్నంగా బయటకు వచ్చిన విదేశీ మహిళ, జుట్టుపట్టుకుని చితకబాదేసి ?

యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు

యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు

బెంగళూరు సిటీలోని మంగమ్మనపాళ్యలోని మదీనా నగర్ లో సోహేల్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. నేరాలకు పాల్పడుతున్న సోహేల్ కోసం పోలీసులు గాలించారు. చివరికి పోలీసులు 2000 సంవత్సరంలో జరిగిన ఓ కేసులో సోహేల్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. 2004లో కోర్టు నిందితుడు సోహేల్ కు యాజవజ్జీవ కారాగార శిక్ష విధించడంతో అతన్ని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

పెరోల్ మీద బయటకు వచ్చాడు

పెరోల్ మీద బయటకు వచ్చాడు

మూడు సంవత్సరాలు జైల్లో ఉన్న సోహేల్ 2007లో తనకు అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సోహేల్ కు 30 రోజులు మాత్రం పెరోల్ మంజూరు చేసింది. పెరోల్ మీద బయటకు వచ్చిన తరువాత సోహేల్ కనపడకుండా పోయాడు. సోహేల్ జైలుకు రాకపోవడంతో జైలు సిబ్బంది మడివాళ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆయుర్వేద ఔషదాల వ్యాపారం

ఆయుర్వేద ఔషదాల వ్యాపారం

బెంగళూరు నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి చేరుకున్న సోహేల్ అతని పేరు మార్చుకుని అక్కడ ఆయుర్వేద ఔషదాలు విక్రయించే షాపు ప్రారంభించాడు. అక్కడే వ్యాపారం చేసుకుంటున్న సోహేల్ బెంగళూరు వైపు కన్నెత్తికూడా చూడలేదు. నిందితుడు సోహేల్ ఆచూకి చెప్పిన వారికి రూ. 1 లక్ష బహుమానం అందిస్తామని పోలీసు అధికారులు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రకటించారు.

షాప్ తీశాడు... బుట్టలో వేసుకున్న పోలీసులు

షాప్ తీశాడు... బుట్టలో వేసుకున్న పోలీసులు

సోహేల్ గురించి అతని బంధువులు, స్నేహితుల్లో ఎవ్వరూ అతని ఆచూకి చెప్పలేకపోయారు. చివరికి బెంగళూరులోని మడివాళ పోలీసులకు సోహేల్ గురించి పక్కా సమాచారం అందింది. బెళ్తంగడి వెళ్లిన మడివాళ పోలీసులు ఉదయం షాప్ తియ్యడాకికి వచ్చిన సోహేల్ ను అరెస్టు చేశారు. సోహేల్ ను అరెస్టు చేసిన మడివాళ పోలీసులకు రూ. 1 లక్ష బహుమానం అందిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
An old criminal caught by the police after 15 years escaped from prison on parole in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X