వీడియో: బైక్‌పై ఇద్దరమ్మాయిల ముద్దులు.. హగ్గులు
న్యూఢిల్లీ: రన్నింగ్ బైక్‌పై లవర్స్ బహిరంగంగా రొమాన్స్ చేసిన వీడియోలు మొన్నటి వరకు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. బైక్ వీలింగ్ అనేది సర్వ సాధారణం అయింది. బైక్ రేసుల గురించి చెప్పుకోనక్కర్లేదు. రద్దీ రోడ్లపైనా బైక్ రేసులను నిర్వహిస్తూ తోటి వాహనదారులను భయాందోళనకు గురి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే షాక్ కావడం గ్యారంటీ. ఇక్కడ కనిపించే సీన్ కూడా అలాంటిదే మరి. వైరల్‌గా మారిన తాజా వీడియోలో- ఇద్దరు అమ్మాయిలు రన్నింగ్ బైక్‌పై ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం, లిప్ లాక్ ఇచ్చుకోవడం, కౌగిలించుకోవడం చూడొచ్చు. బైక్‌పై వాళ్లు కూర్చున్న తీరు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ వీడియో ఎక్కడిదనేది తెలియరావట్లేదు గానీ.. బైక్ ముందు ఉన్న నంబర్ ప్లేట్‌లో టీఎన్ అనే అక్షరాలు కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఇది తమిళనాడుకు చెందినదై ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఈ వీడియో తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ అయినట్టుగా చెబుతున్నారు.
తాజాగా ఘంటా అనే నెటిజన్.. ఈ వీడియోను ఇవ్వాళ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ వీడియో క్లిప్. 26 లక్షల మంది దీన్ని తిలకించారు. 81 వేలమందికి పైగా దీన్ని లైక్ చేశారు. 1400లకు పైగా కామెంట్స్ పోస్ట్ అయ్యాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తోన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications