‘‘రూ.32 లక్షలు ఇవ్వండి.. లేకుంటే మీ అమ్మాయి నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తా’’

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు : 'రూ.32 లక్షలు ఇవ్వకుంటే మీ అమ్మాయి నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తా..' అంటూ ఓ ఆగంతకుడు ఓ యువతి తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ పంపిన ఉదంతం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది.

బెంగళూరుకు చెందిన ఓ టీనేజ్ అమ్మాయికి వాట్సాప్‌ లో అపరిచిత వ్యక్తి నుంచి ఓ సందేశం వచ్చింది. అడిగిన డబ్బు ఇవ్వకుంటే నీ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని ఓ అపరిచితుడు బ్లాక్ మెయిల్ చేస్తూ సందేశం పంపించాడు.

 An Unknown person blackmailed tenage girl in Bangalore that he will post her nude pics in social Media

దీంతో భయపడిన ఆ అమ్మాయి అపరిచితుడి వాట్సాప్ నంబరు, ఫేస్‌బుక్ ఖాతాలను బ్లాక్ చేసింది. అయినా సరే ఆ అగంతకుడు ఆమెను వదలలేదు. ఆ యువతి తల్లి పేరిట ఉన్న వాట్సాప్ నంబరుకు మళ్లీ బెదిరింపు మెసేజ్ పంపించాడు.

ఆమె ఆ నంబరును బ్లాక్ చేసినా మరో కొత్త నంబరు నుంచి మరో మెసేజ్ పంపాడు. తనకు డబ్బు ఇవ్వకుంటే మీ అమ్మాయి నగ్న చిత్రాలు బహిర్గతం చేస్తానని అపరిచితుడు ఆ యువతి తల్లిని కూడా బెదిరించాడు.

ఈ బెదిరింపులతో విసిగిపోయిన ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 67, 66, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ అపరిచితుడి కోసం గాలిస్తున్నారు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడితో ఆ టీనేజి యువతికి పరిచయం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Unknown person blackmailed tenage girl in Bangalore that he will post her nude pics in social Media. He demanded Rs.32 Lakhs. He threatened her parents also that if they will not give the amount he will post their daughter's nude pics in social media. Her father fedup with this guy and directly went to police station and lodged a complaint. Police started enquiry in this case and they came to an understand that the man who threatening the girl is a known person to her.
Please Wait while comments are loading...