ఏనుగు ప్యాంటేస్తే Ele-Pant... -వైరల్ పిక్‌ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
మిగతా పారిశ్రామికవేత్తలకు భిన్నంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, దేశసమకాలీన పరిస్థితులపై స్పందించడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. తన దృష్టికి వచ్చిన సందేశాత్మక, ఫన్నీ ఫొటోలు, వీడియోలను ఎప్పుడూ సోషల్‌మీడియాలో పంచుకుంటారాయన. తాజాగా..
Recommended Video
అందంగా ముస్తాబైన ఏనుగు ఫొటోను మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ''ఇన్‌క్రెడిబుల్ ఇండియా. ఎలీ-ప్యాంట్..'' అంటూ ట్వీట్ చేసిన మహీంద్రా ఏనుగు చొక్కా, ప్యాంటు ధరించిన చిత్రాన్ని పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలో ఏనుగు పర్పుల్ కలర్ షర్ట్, వైట్ ప్యాంట్‌తో పాటు బ్లాక్ బెల్టును ధరించి మావటి వెనకాలే వెళ్తున్నది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
నెటిజన్లు సరదా కామెంట్లు, ఫన్నీ మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ఏనుగుకు ప్యాంట్...మావటికి లుంగీ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. ప్యాంట్‌లో ఏనుగు కంఫర్ట్‌గా ఉందా అంటూ మరొకరు స్పందించారు.
Incredible India. Ele-Pant... pic.twitter.com/YMIQoeD97r
— anand mahindra (@anandmahindra) March 3, 2021












Click it and Unblock the Notifications