Haryana Polls: సీఎం రేసులో అనిల్ విజ్ - మోదీ ఎవరి వైపు..!!

Haryana Assembly Elections: హర్యానా ఎన్నికలు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదలతో ఇక్కడ ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. త్రిముఖ పోరు ఎవరికి నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలోనే బీజేపీలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ తాజాగా బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో..బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సీఎం రేసులో
హర్యానాలో ఎన్నికల రాజకీయం రోజురోజుకీ వేడి పెంచుతోంది. ఇక్కడ కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని భావించినా ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలు ఖరారు చేసాయి. మొత్తంగా 90 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీ 89 చోట్ల బరిలోకి దిగుతుండగా ఒక స్థానాన్ని సిపిఎంకు కేటాయించింది. పొత్తు చర్చలు కుదరకపోవడంతో సింగిల్ గా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. దీంతో 40 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కీలకంగా మారాలని ఆప్ భావిస్తోంది. ఇదే సమయంలో బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Anil Vij says will stake claim for the Harayana CM Post if BJP wins

ప్రజలే కోరుతున్నారు
బీజేపీ ఎన్నికల ప్రచారం తీవ్రతరం చేసింది. సీనియర్‌ బీజేపీ నేత, మాజీ మంత్రి అనిల్‌ విజ్‌ హరియాణ సీఎం పీఠంపై కన్నేశారు. తాను పార్టీలో సీనియర్‌నని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే తాను సీఎం రేసులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. హరియాణ ప్రస్తుత సీఎం నయబ్ సింగ్‌ సైనీ పార్టీ సీఎం అభ్యర్ధిగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అనిల్‌ విజ్‌ ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తానిప్పటి వరకూ పార్టీ నుంచి ఏమీ కోరలేదని, కానీ ఇప్పుడు తన సీనియరిటీ ప్రకారం సీఎం పదవిని తాను కోరుతున్నానని చెప్పారు. అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

సీఎం పదవి రేసులో
హర్యానా ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం పదవి చేపట్టాలనేది వారి నుంచి వచ్చిన ప్రతిపాదనగా వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు, తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని సీఎం పదవికి తనను పరిశీలించాలని ఈసారి తాను కోరతానని చెప్పారు. పార్టీ నాయకత్వం తనకు హరియాణ సీఎం పదవి అప్పగిస్తే హర్యానా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తానని తెలిపారు. అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. ఖట్టర్ ప్రభుత్వంలో అనిల్ విజ్ మంత్రిగా పని చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+