Weather: 2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
Delhi temperature: దేశ రాజధానిలో చలి తీవ్రత కొనసాగుతోంది. చలిగాలులు వణికిస్తోన్నాయి. ఎముకలు కొరికేంతటి చలిని చవి చూస్తోన్నారు ఢిల్లీవాసులు. ఇదే పరిస్థితి మరి కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించింది.
కొద్ది రోజులుగా ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉష్ణోగ్రత భారీగా పడిపోతూ వస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 10 నుంచి 6 డిగ్రీల వరకూ నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడిది తుడిచి పెట్టుకుపోయింది. సఫ్దర్ జంగ్ ఏరియాలో రెండు రోజుల కిందట డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ తెల్లవారు జామున ఇప్పుడదే ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.4 డిగ్రీకి పడిపోయింది.

17 సంవత్సరాల తరువాత కనిష్ఠ ఉష్ణోగ్రత ఈ స్థాయికి పడిపోవడం ఇదేే తొలిసారి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా సౌత్ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 4 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సామాన్యులకు చలి నుంచి రక్షణ కల్పించడానికి ఢిల్లీ ప్రభుత్వం నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. వారికి అవసరమైన బ్లాంకెట్లు, ఇతర సదుపాయాలను కల్పిస్తోంది.
దట్టమైన పొగమంచు వీడట్లేదు. 50 మీటర్ల దూరం వరకూ ఏదీ కనిపించని విధంగా మంచుతెరలు కమ్ముకుంటోన్నాయి. దీనివల్ల విమానాల రాకపోకలకు తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. విజిబిలిటీ లోపించడం వల్ల సమయానికి అవి ల్యాండ్ కావట్లేదు. టేకాఫ్ తీసుకోవట్లేదు. ఫలితంగా ప్రయాణికులు గంటల కొద్దీ జాప్యాన్ని ఎదుర్కొంటోన్నారు. ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు పడుతున్నారు.

అటు రైళ్ల రాకపోకలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది పొగమంచు. రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తోన్నాయి. పలు రైళ్లూ రద్దవుతున్నాయి. దాదాపుగా ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోని గంగా నగర్, పటియాలా, అంబాలా, చండీగఢ్, పాలం, బరేలీ, లక్నో, బహ్రయిచ్, వారణాశి, ప్రయాగ్ రాజ్, తేజ్‌పూర్‌లల్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
-
బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications