Byelections: 7 రాష్టాల్లో 13 ఉపఎన్నికల పోలింగ్ - ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పోరు.. మొదలైన ఓటింగ్..!
Byelections Voting: దేశంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలకమైన ఎన్నికల పోరు ఇవాళ జరుగుతోంది. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా కూటమితో ఎన్డీయే తలపడుతున్న పోరు కావడంతో ఈ ఉపఎన్నికలపై ఆసక్తి నెలకొంది. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పంజాబ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్ లోని 13 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బెంగాల్లో రాయ్ గంజ్, రాణాఘాట్, దక్షిణ్, బాగ్దా సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ సీటు, మాంగ్లోర్ సీటుకు ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లలోని డెహ్రా, హమీర్ పూర్, నలాగర్హ్ సీట్లకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో డెహ్రా సీటులో సీఎం సుఖ్వీందర్ సింగ్ సతీమణి కమ్లేష్ ఠాకూర్ ను పోటీలో నిలపడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

#WATCH | Bihar: JD(U) candidate Kaladhar Prasad Mandal casts his vote at a polling booth in Purnea, for Rupauli Assembly by-election. pic.twitter.com/0DsLrHIdzq
— ANI (@ANI) July 10, 2024
అలాగే తమిళనాడులోని విక్రవండి సీటుకు, బీహార్ లోని రాపౌలీ సీటుకు, మధ్యప్రదేశ్ లోని అమర్వారా సీటుకు, పంజాబ్ లోని జలంధర్ వెస్ట్ సీటుకు కూడా ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా సీట్లలో ఎన్డీయే పక్షాలకూ, ఇండియా కూటమి పార్టీలకు మధ్య ముఖాముఖీ పోరు జరుగుతోంది. ఈ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపును జూలై 13న చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. వీటి ఫలితాలు నేరుగా ప్రభుత్వాలపై ప్రభావం చూపకపోయినా ఓటరు నాడి ఆధారంగా భవిష్యత్ రాజకీయాలు ఆధారపడనున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications