Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్? కేంద్రం చేతుల్లోకి ఆ రూ.15 వేల కోట్ల ఆస్తి..!

తాజాగా ముంబైలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పటౌడీ కుటుంబ వారసుడైన సైఫ్ అలీ ఖాన్ కు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న పటౌడీ ప్యాలెస్ చాలా కీలకమైంది. దీని యాజమాన్యంపై 2015 నుంచీ కొనసాగుతున్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేయడంతో కేంద్రం దీన్ని స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లయింది.

క్రికెట్ దిగ్గజం, రాజకుటుంబానికి చెందిన నవాబ్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతుల కుమారుడైన సైఫ్ అలీ ఖాన్ కు భారీగా ఆస్తులు ఉన్నాయి. అయితే సినిమాలపై మమకారంతో ఆయన బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా సైఫ్ ఇంట్లో ఓ దొంగ ప్రవేశించి అడ్డుకోబోయిన ఆయనపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆస్పత్రి పాలైన సైఫ్ నిన్న డిశ్చార్జ్ అయ్యారు. అలా ఇంటికి వచ్చారో లేదో ఆయనకు మరో చేదు వార్త అందింది.

another shocker to actor saif ali khan as hc lifts stay on rs 15k cr worth Pataudi family property

మధ్యప్రదేశ్ హైకోర్టు శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ లో పటౌడీ కుటుంబానికి ఉన్న రూ.15 వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై ఉన్న స్టేను ఎత్తేసింది. 1968 నాటి శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం పాకిస్తాన్ విభజన తర్వాత భారతీయులు విదేశాలకు వెళ్లిపోతే వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే 2017లో ఈ చట్టానికి సవరణలు కూడా చేశారు. ఇందులో వారి వారసులకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చు.దీంతో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఈ రూ.15 వేల కోట్ల ఆస్తులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయాల్సి ఉంది.

భోపాల్ చివరి నవాబు అయిన హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోయారు. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ భారతదేశంలోనే ఉండి నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకుని, చట్టబద్ధమైన వారసురాలు అయ్యారు. సాజిదా మనవడు సైఫ్ అలీఖాన్ ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసత్వంగా పొందాడు. అయితే ఆబిదా సుల్తాన్ పాకిస్తాన్ వెళ్లిపోవడంతో ఈ కుటుంబ ఆస్తులు కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశం లభించింది.
అయితే 2019లో కోర్టు సాజిదా సుల్తాన్‌ను చట్టబద్ధమైన వారసురాలిగా గుర్తించింది. దీని ప్రకారం ఇప్పుడు సైఫ్ పోరాటం చేయాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+