అక్లాండ్ రోడ్లపై కోహ్లీతో అనుష్క చెట్టాపట్టాల్ (ఫోటో)
అక్లాండ్: జబ్ తక్ హో జాన్ చిత్ర కథానాయిక అనుష్క శర్మ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో న్యూజిలాండులో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారట. కోహ్లీ, అనుష్కల మధ్య ఏదో ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తనకు కోహ్లీ మంచి స్నేహితుడు మాత్రమేనని అనుష్క చెబుతూ వస్తోంది.
అనుష్క ఎక్కడ ఉంటే కోహ్లీ అక్కడ ఉంటాడనే టాక్ ఉంది. తాజాగా అందుకు సంబంధించిన మరో ఉదాహరణ లభించిందంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం ఆ దేశంలో ఉన్నాడు.

అక్కడ కోహ్లీతో అనుష్క శర్మ చేతిలో చెయ్యి వేసుకొని చక్కర్లు కొడుతోందట. న్యూజిలాండులోని అక్లాండులో కోహ్లీ, అనుష్కలు కెమెరాలకు చిక్కారు. ఇప్పుడు ఆ ఫోటో వెబ్ సైట్లలో హల్‌చల్ చేస్తోంది.
సమాచారం మేరకు... అనుష్క శర్మ ప్రత్యేకంగా కోహ్లీతో గడిపేందుకే న్యూజిలాండ్ వచ్చారట. అక్కడి అందమైన ప్రదేశాల్లో ప్రత్యేకమైన సమయాన్ని గడుపుతోందట. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో కోహ్లీ, అనుష్క శర్మల చక్కర్లపై అభిమానులు స్పందిస్తున్నారు. వన్డేల అనంతరం ఇప్పుడు న్యూజిలాండ్ భారత్‌ల మధ్య గురువారం టెస్టు మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
కాగా, ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున విరాట్ విమానాశ్రయం నుంచి నేరుగా ముంబయిలోని అనుష్క ఇంటికి వెళ్లి పార్టీ ఎంజాయ్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ, తామిద్దరం మంచి స్నేహితులమని తిరస్కరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications