AP-TS weather: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, తీవ్ర తుఫానుగా అల్పపీడనం
హైదరాబాద్/అమరావతి: దక్షిణ థాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ స్థాయి ట్రోపోస్పేయర్ వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది.

తీవ్ర తుఫానుగా అల్పపీడనం
ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి డిసెంబర్ 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత 24 24 గంటల్లో మరింత తీవ్రమైన తుఫానుగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తరవ్ాత వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి డిసెంబర్ 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో మంగళవారం కిందిస్థాయి గాలులు తూర్పు దిక్కు నుంచి వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

కోస్తా తీరాన్ని తాకనున్న అల్పపీడనం
కాగా, దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతల్లో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 4 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ పరిస్థితుల కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మంగళవారం ప్రధానంగా పొడి వాతా వరణం ఉంటుంది. బుధావరం కూడా పొడి వాతా వరణం ఉంటుంది. గురువారం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చొట్ల కురిసే అవకాశముంది.

కోస్తా, రాయలసీమల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రలో మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
Recommended Video

భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి
ఇక రాయలసీమ జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మళ్లీ వర్షాలు కురిసే అకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దిగజారేలా ఉందని ఇప్పటికే వరదలతో ఇబ్బందులపాలైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాము వేసిన పంటలు నీటమునగడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.












Click it and Unblock the Notifications