Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలో ఆప్ లీడ్‌పై కార్యకర్తల కోలాహలం,మిఠాయి తినిపించుకొని సంబరాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. 50 నియోజకవర్గాలకు పైగా లీడ్‌లో కొనసాగుతోంది. అసెంబ్లీలో 70 నియోజకవర్గాలు ఉండగా.. మెజార్టీ మార్క్ 36 సీట్లు.. అయితే తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆప్ కార్యకర్తలు సంతోషంలో మునిగితేలారు. ఆప్‌దే విజయం అని కేరింతలు కొడుతున్నారు. ఢిల్లీలో ఆప్ 53 కోట్ల లీడ్‌లో కొనసాగుతోంది.

 కార్యకర్తల సంబరాలు..

కార్యకర్తల సంబరాలు..

ఆప్ విజయం సాధించనుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద మద్దతుదారుల భారీగా చేరుకున్నారు. పెద్ద స్క్రీన్‌పై తమ పార్టీ ఆధిక్యంలో కొనసాగడం చూసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొన్నారు. తర్వాత మిఠాయి తినిపించుకొని ఆనంద డోలికల్లో మునిగితేలారు.

ఆఫీసు వద్ద కోలాహలం..

ఆఫీసు వద్ద కోలాహలం..

మరోవైపు ఢిల్లీలో గల ఆప్ కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు. బెలూన్లు కట్టి ముస్తాబు చేశారు. ఆప్ పార్టీ కార్యాలయం వద్ద కూడా కార్యకర్తల కోలాహలం నెలకొంది. గత ఎన్నికల మాదిరిగానే తమకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా హస్తినలో ఆప్‌కే ప్రజలు పట్టం కడతారని పేర్కొన్న సంగతి తెలిసిందే.

 వాడిపోయిన కమలం

వాడిపోయిన కమలం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విశ్వాసం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ధీమాతో ఉన్నారు. వారు అంచనా వేసినట్టు హస్తినలో ఆప్ దూసుకెళ్తోంది. చీపురు పార్టీ హవాకు కమలం, హస్తం పార్టీలు కనిపించకుండా పోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+