జాగ్రత్త.. భారత్‌పై భారీ ఉగ్రదాడి జరగబోతోంది: ఆర్మీ చీఫ్ హెచ్చరిక

భారత్‌పై భారీ ఉగ్రదాడి జరగబోతోందని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ బుధవారం హెచ్చరించారు. ఉరీ తరహా ఉగ్రదాడి మరోమారు జరగబోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు చెప్పారు.

న్యూఢిల్లీ : భారత్‌పై భారీ ఉగ్రదాడి జరగబోతోందని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ బుధవారం హెచ్చరించారు. దేశంలోని మారుమూల ప్రదేశాల్లో భద్రత లోపించిందని, ఉరీ తరహా ఉగ్రదాడి మరోమారు జరగబోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు చెప్పారు.

సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడం, నిఘా వర్గాలను మరింత బలపరచడంతోపాటు సాధ్యమైనంత త్వరగా భారత ఆర్మీని దుర్భేద్యంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Army Chief warns of Uri-like terror attack, calls for better intelligence

ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ బలపడాలని రావత్ సూచించారు. ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్‌ను వినియోగించే యోచనలో కూడా ఉన్నట్లు చెప్పారు.

గతేడాది ఉరీ ఉగ్రదాడి అనంతరం.. భారత సైన్యం పాకిస్తాన్‌ భూభాగంలోకి వెళ్లి సర్జికల్‌ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అవసరమైతే మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహిస్తామని కూడా రావత్‌ కొద్దిరోజుల క్రితం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+