ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా 100కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు
Bomb threat: దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు అందాయి. దాదాపుగా గంట వ్యవధిలో 100కు పైగా పాఠశాలలకు బెదిరింపు ఇ-మెయిల్స్ అందాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఉదయం 8 గంటల సమయంలో తొలుత అయిదు స్కూళ్లకు ఈ మెయిల్స్ అందాయి. మదర్ మేరీ స్కూల్- మయూర్ విహార్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బీజీఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్- ద్వారకా, సంస్కృతి స్కూల్- చాణక్యపురి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్- వసంత్ కుంజ్, ఐమిటీ స్కూల్- సాకేత్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్- నొయిడాలల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ అందాయి.

వాటిని చూసిన వెంటనే ఆయా పాఠశాలల యాజమాన్యం పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగారు. బాంబు బెదిరింపు మెయిల్స్ అందిన పాఠశాలలన్నింటికీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పంపించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.
ఈ తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే మరన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఇమెయిల్స్ వెళ్లాయి. చూస్తుండగానే ఈ సంఖ్య పెరుగుతూ వెళ్లింది. గంట- గంటన్నర వ్యవధిలో ఈ సంఖ్య 100ను దాటింది. ఇప్పటివరకు 60 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ అందినట్లు తమకు సమాచారం ఉందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గర్గ్ వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.
ఢిల్లీ సెంట్రల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దవేష్ కుమార్ మహ్లా, ఈస్ట్ డీసీపీ అపూర్వ గుప్తా తమ పరిధిలోని స్కూళ్లకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని సురక్షితంగా బయటికి తరలించారు. ఇప్పటివరకు ఎలాంటి బాంబులు, వాటి సంబంధిత ఆనవాళ్లు లభించలేదని వారు తెలిపారు.
రష్యా నుంచి ఈ ఇమెయిల్స్ అందినట్లు పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు ఆదేశించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications