రైతు ఆత్మహత్య-భగ్న ప్రేమ: యూపీఏను తవ్విన జైట్లీ

న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యల పైన వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రకటనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించారు. తన వ్యాఖ్యల పైన రాధామోహన్ సింగ్ అదే రోజు వివరణ ఇచ్చారు.

అనంతరం విపక్షాలు విమర్శలు చేస్తుంటడంతో అరుణ్ జైట్లీ స్పందించారు. అన్నదాతల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలూ ఓ కారణమని యూపీఏ హయాంలో కూడా పేర్కొన్న విషయాన్ని ఆ మేరకు పార్లమెంటులో అప్పుడిచ్చిన లిఖిత పూర్వక సమాధానాల వివరాలనూ అరుణ్ జైట్లీ శనివారం వెలికి తీశారు.

Arun Jaitley defends Radha Mohan Singh over farmer suicide comment, cites UPA replies

వాటిని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఉంచారు. రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలూ కారణమంటూ యూపీఏ ప్రభుత్వం 2012 మార్చి, 2014 ఫిబ్రవరిల్లో పార్లమెంటు ఉభయసభల్లో నాలుగుసార్లు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాల ప్రతులను ట్విట్టర్‌లో ఉంచారు.

యూపీఏ హయాంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న శరద్ పవార్‌, సహాయమంత్రిగా పని చేసిన చరణ్ దాస్‌లు ఇచ్చిన సమాధానాల్లో ప్రేమవ్యవహారం అంశం ప్రముఖంగా ఉందని అరుణ్ జైట్లీ అన్నారు. రైతు ఆత్మహత్యల్లో భగ్నప్రేమను ఒక కారణంగా అప్పటి ప్రభుత్వం కూడా చూపిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+