Arvind Kejriwal: ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి; కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు!!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు నిన్న అరవింద్ కేజ్రీవాల్ కు మార్చి 28వ తేదీవరకు ఈడి కస్టడీకి అప్పగించింది. మళ్లీ మార్చి 28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ అధికారులు ఆరోపించారు. సౌత్ గ్రూప్ కు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని, మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, మద్యం ముడుపుల కేసులో ఆయన కోట్లాది రూపాయలు అందుకున్నారని ఈడీ ఆరోపించింది.

Arvind Kejriwal night slept in lockup in ED custody kejriwal key comments

కేజ్రీవాల్ మొత్తం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 100 కోట్ల రూపాయల ముడుపులు డిమాండ్ చేశారని పేర్కొన్న ఈడి, అందులో 45 కోట్ల రూపాయలను గోవా ఎన్నికలలో ఉపయోగించారని పేర్కొంది. నాలుగు హవాలా మార్గాల నుంచి ఈ డబ్బులు వచ్చినట్లుగా ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారని ఆయన తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ వాదనతో ఏకీభవించి ఆయనను కస్టడీకి ఇచ్చింది. ఇక నిన్న రాత్రి ఈడి కస్టడీలో తొలిరాత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చాలా భారంగా గడిచింది. లాకప్ రూమ్ లో ఉంచి పరుపు, దుప్పటి ఇచ్చి పడుకోమన్నారు. అయితే ఏసి సదుపాయం కూడా కల్పించారు. ఇక తొలి రాత్రి అంతా లాకప్ రూమ్లో అరవింద్ కేజ్రీవాల్ చాలా భారంగా గడిపారు.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఈడీ అధికారులు కల్పించలేదు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తాను జైలు నుండే ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యబోనని ఆయన తేల్చి చెప్తున్నారు. ఢిల్లీ సీఎం ఆధ్వర్యంలోని ఆప్ కూడా కేజ్రీవాలే తమ సీఎం అని స్పష్టం చేస్తుంది.

అయితే సీఎం గా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే రాజీనామా చెయ్యాలని ఎక్కడా చట్టంలో లేదని కొందరు సీనియర్ లాయర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ విలువలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవి నుండి దిగిపోతే మంచిదని మరికొందరు సీనియర్ అడ్వకేట్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+