ఈడీ ముందుకు కేజ్రీవాల్ - అరెస్ట్ కు ఛాన్స్, నెక్స్ట్ సీఎం..!?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలతో ఆయనను ఈడీ విచారించనున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్నారు. అరెస్ట్ ఖాయమంటూ ఆప్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ విచారణ ఎదుర్కొన్నారు. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీశ్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా గత 9 నెలలుగా తీహార్ లో జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఎదుట కేజ్రీవాల్ హాజరు కానుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇక ఇదే కేసులో అక్టోబర్ 4న మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆప్ నేతలు అంచనా వేస్తున్నట్లు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఢిల్లీ సీఎంగా ఎవరికి ఛాన్స్ ఉంటుందనే చర్చ కూడా ఇప్పటికే మొదలైంది. కేజ్రీవాల్ విచారణకు హాజరై అరెస్ట్ అయితే గనక ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఢిల్లీ యాక్టంగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సునితా కేజ్రీవాల్ కూడా ఐఆర్ఎస్ అధికారే. 22 ఏళ్ల పాటు ఆమె సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐటీ కమిషనర్ హోదాలో పనిచేస్తుండగా ఈ ఏడాది ఆమె వీఆర్ఎస్ కు అప్పీల్ చేసుకున్నారు.
#WATCH | Heavy security deployment outside the Enforcement Directorate (ED) in Delhi.
— ANI (@ANI) November 2, 2023
ED has summoned Delhi CM and AAP national convener Arvind Kejriwal to appear before them today in connection with the Delhi excise policy case. pic.twitter.com/Y274YjVy6o
అయితే, విచారణ తరువాత కేజ్రీవాల్ అరెస్ట్ అయితే న్యాయ పరంగా సీఎం పదవి నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను ఇప్పటికే ఆప్ నేతలు అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినా మంత్రివర్గ సమావేశాల నిర్వహణ..నిర్ణయాల కోసం మరో మంత్రికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. రెండేళ్లకు మించి శిక్ష పడితేనే పదవి వదులుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..ఢిల్లీ ప్రభుత్వంలో ఏం జరుగుతందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
#WATCH | Delhi | Heavy security deployment outside Rajghat. Police announcement being made that CM Kejriwal is expected to visit Rajghat around 10 am before leaving for the ED office.
— ANI (@ANI) November 2, 2023
ED has summoned Delhi CM and AAP national convener Arvind Kejriwal to appear before them today… pic.twitter.com/Pw0rrLqkIL












Click it and Unblock the Notifications