వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ అండర్ ట్రయల్ ఖైదీ నెం: 956 ; 4,500 మనీ ఆర్డర్.. షారూక్, గౌరీ ఖాన్ లతో వీడియో కాల్ !!

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ ఉచ్చు బిగుస్తుంది. బెయిల్ పిటిషన్ పై విచారణ సాగించిన ముంబై సెషన్స్ కోర్ట్ బెయిల్ పిటిషన్ పై తన తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 20వ తేదీన బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడించనుంది. దీంతో అప్పటివరకు ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉండనున్నారు. కొడుకును బెయిల్ పై బయటకు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న షారూక్ ఖాన్ కు అడుగడుగునా షాక్ తగులుతుంది. జైల్లో ఆర్యన్ ఖాన్ ఏడుస్తుండగా, ఇంట్లో షారూక్ ఖాన్, గౌరీఖాన్ లతో పాటు సోదరి తీవ్రంగా ఏడుస్తున్నట్టు తెలుస్తుంది.

ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ ఎఫెక్ట్: చీటింగ్ కేసులో ఉన్న ప్రైవేట్ డిటెక్టివ్ పై లుకౌట్ నోటీసులుఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ ఎఫెక్ట్: చీటింగ్ కేసులో ఉన్న ప్రైవేట్ డిటెక్టివ్ పై లుకౌట్ నోటీసులు

జైల్లో ఆర్యన్ ఖాన్ .. అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 956

జైల్లో ఆర్యన్ ఖాన్ .. అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 956

కోర్టు బెయిల్ పిటీషన్ పై తీర్పును 20 వ తేదీకి వాయిదా వెయ్యటంతో జైలు అధికారులు ఆర్యన్ ఖాన్ కు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 956 ను కేటాయించారు. ఇంతకు ముందు ఉన్న బ్యారెక్ నుండి మరో బ్యారెక్ కు తరలించారు. జైల్లో ఆర్యన్ ఖాన్ సరిగా భోజనం చెయ్యటం లేదని సమాచారం. ఇక తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ కొడుకు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్యన్ ఖాన్ కోసం షారుక్ ఖాన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇంటి నుండి 4500 రూపాయల మనీ ఆర్డర్ అందుకున్న ఆర్యన్ ఖాన్

ఇంటి నుండి 4500 రూపాయల మనీ ఆర్డర్ అందుకున్న ఆర్యన్ ఖాన్

ఇదిలా ఉంటే జైలు నియమ నిబంధనల ప్రకారం అరెస్ట్ అయిన వారికి గరిష్ఠంగా 4500 రూపాయలు మనీ ఆర్డర్ ను పంపవచ్చు. అంతేకాదు బాంబే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఖైదీలు వారానికి ఒకసారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. దీంతో జైలు నిబంధనల ప్రకారం ఆర్యన్ ఖాన్ ఈ వారం ₹ 4,500 విలువైన మనీ ఆర్డర్‌ని అందుకున్నాడు. ఈ డబ్బులను ఆర్యన్ ఖాన్ తనకు క్యాంటీన్ నుండి స్నాక్స్ కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోడానికి వీలుంటుంది.

షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ లతో10 నిమిషాల పాటు వీడియో కాల్‌ లో ఆర్యన్ ఖాన్

షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ లతో10 నిమిషాల పాటు వీడియో కాల్‌ లో ఆర్యన్ ఖాన్

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ తన కుటుంబంతో 10 నిమిషాల పాటు వీడియో కాల్‌ లో మాట్లాడినట్లు సమాచారం. కోవిడ్ కారణంగా ఖైదీలు వారానికి రెండుసార్లు వారి కుటుంబాలతో వీడియో కాల్ మాట్లాడడానికి కోర్టు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్, తల్లి గౌరీ ఖాన్ లతో మాట్లాడారు. ఈ సమయంలో ఆర్యన్ ఖాన్ తల్లి దండ్రులకు తనను క్షమించమని అడిగినట్టు సమాచారం. తీవ్రంగా వారు బాధపడినట్టు తెలుస్తుంది.

 కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు జైలు రూల్స్ మేరకే ఆర్యన్ ఖాన్ కు ఆహారం

కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు జైలు రూల్స్ మేరకే ఆర్యన్ ఖాన్ కు ఆహారం

అయితే, జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్, ఆర్యన్‌కు జైలు ఆహారం మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వు జారీ అయ్యే వరకు స్టార్ కొడుకు అయినా ఆర్యన్ ఖాన్ కు ఇంటి నుండి లేదా బయటి నుండి తెచ్చిన ఆహారం అందించబడదని ఆయన చెప్పారు. ముంబై డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో నాలుగోసారి బెయిల్ పై కోర్టు తేల్చకపోవడంతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిన్న సాయంత్రం తిరిగి జైలుకు పంపబడ్డాడు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆందోళన షారూక్ ఖాన్ కుటుంబంలో కనిపిస్తుంది.

పండుగ సమయంలో కోర్టుకు సెలవులు .. 20 వ తేదీ వరకు జైల్లోనే

పండుగ సమయంలో కోర్టుకు సెలవులు .. 20 వ తేదీ వరకు జైల్లోనే

ఆర్యన్ న్యాయవాదుల బృందం మరియు అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సిబి నుండి సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ముంబై సెషన్స్ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై ఆర్డర్‌ని అక్టోబర్ 20 వరకు రిజర్వ్ చేసింది. ఇప్పటికే 12 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్‌కు చట్టపరమైన మరెటువంటి ఆప్షన్ లేదు . పండుగ సీజన్ కోసం కోర్టు ఇప్పుడు మూసివేయబడినందున కనీసం మరో ఐదు రోజులు జైలులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్యన్ కు తాజాగా చేసిన కోవిడ్ -19 పరీక్షలలో ఫలితం నెగెటివ్ కావడంతో అతడిని సాధారణ సెల్‌కు తరలించారు.

గ్లోబల్ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ ఖాన్ కు లింకులు .. బెయిల్ ఇవ్వొద్దన్న ఎన్సీబీ

గ్లోబల్ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ ఖాన్ కు లింకులు .. బెయిల్ ఇవ్వొద్దన్న ఎన్సీబీ

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాల సాధారణ వినియోగదారు అని ఆరోపించిన తర్వాత కోర్టు ఈ చర్య తీసుకుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నిందితుడు నం -1 అని ముంబై క్రూయిజ్ షిప్ మాదకద్రవ్యాల కేసుకు మూలం అని ఆరోపించింది. గ్లోబల్ డ్రగ్స్ ముఠాతో డ్రగ్స్ అక్రమ రవాణా కు సంబంధించిన లావాదేవీలు ఆర్యన్ ఖాన్ చేసినట్టు ఆరోపించింది. ప్రతిస్పందనగా, సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్, ఆర్యన్ ఖాన్ తరఫున బలమైన వాదనలు వినిపించారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించని షారూక్, గౌరీ ఖాన్ లు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించని షారూక్, గౌరీ ఖాన్ లు

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన సమయంలో ఆర్యన్ ఖాన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లేవని, అక్రమ రవాణా ఆరోపణ అసంబద్ధమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ అరెస్టుపై, ఆర్యన్ ఖాన్ పై వస్తున్న ఆరోపణలపై ఇప్పటివరకు షారుక్ ఖాన్ గాని, గౌరీ ఖాన్ గానీ మాట్లాడలేదు. కొడుకు భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లుగా బాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఇక బాలీవుడ్ వర్గాలలో ప్రముఖులు చాలామంది షారుక్ ఖాన్ కు కష్టకాలంలో తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, హ్రితిక్ రోషన్ వంటి వారు ఆర్యన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.

English summary
jail authorities assigned Aryan Khan under trial prisoner number 956. Aryan Khan received a money order of Rs 4500 from his parents.Shahrukh Khan, gauri khan spoke with aryan Khan in a video call for 10 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X