జై హింద్! ఆపరేషన్ సింధూర్ - ప్రధాని ముందు ఓవైసీ అనూహ్య ప్రతిపాదన..!!
పాక్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత్ ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ సైన్యం క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. సైన్యాన్ని అభినందిస్తూ సందేశాలు ఇస్తున్నారు. ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఈ ప్రతీకార దాడుల పైన స్పందించారు. కీలక ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు.
ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టారు. కేవలం గంట ల వ్యవధిలో గురి పెట్టి మరీ ఉగ్రవాద ప్రధాన స్థావరాలను నేల మట్టం చేసారు. సైన్యం ఆపరేషన్ పైన దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంఐఎం అధినేత ఈ స్ట్రైక్స్ పైన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆపరే షన్ సింధూర్‌కు అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగా లు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇదే సమయంలో కొత్త డిమాండ్ చేసారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఓవైసీ కోరారు. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని తెలిపారు. జై హింద్! ఆపరేషన్ సింధూర్ అని అసదుద్దీన్ ఒవైసీ పూర్తి మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.
मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025
ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల ను భారత సైన్యం మరి కాసేపట్లో వెల్లడించనుంది. ఒక్క సారిగా జరిగిన దాడుల్లో ఉగ్రవాదుల క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారు మరణించారు. జైషే ఈ మహ్మద్, లష్కర్ తోయిబా అగ్ర నేతలు సైతం హతం అయినట్లు తెలుస్తోంది. పాక్ తో సహా పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.












Click it and Unblock the Notifications